పోర్చుగల్‌ అమ్మాయి.. పాలమూరు అబ్బాయి..

9 Jun, 2018 08:26 IST|Sakshi
శ్రీపాల్‌ తల్లిదండ్రులతో వధూవరులు

సాక్షి, జడ్చర్ల: ప్రేమకు కులం, మతం, భాషతో పాటు ప్రాంతం అడ్డుకాదని నిరూపించారు ఓ ప్రేమ జంట. పోర్చుగల్‌ దేశానికి చెందిన అమ్మాయి, మహబూబ్‌ నగర్‌ జిల్లా జడ్చర్లకు చెందిన అబ్బాయి శుక్రవారం వివాహం చేసుకోగా.. జడ్చర్లలో రిజిస్ట్రార్‌ కార్యాలయం ఇందుకు వేదికైంది. జడ్చర్ల స్థానిక పద్మావతి కాలనీకి చెందిన మట్ట శ్రీపాల్‌(32) లండన్‌లో ఆడిటింగ్‌ విభాగంలో ఉద్యోగం చేస్తున్నారు. ఈ మేరకు అక్కడకు నాలుగేళ్ల క్రితం విహార యాత్రకు వచ్చి న పోర్చుగల్‌ రాజధాని లిస్బన్‌కు చెందిన వేర వెగాస్‌ లుకా వెలోజా(34)తో ఆయనకు పరిచ యం ఏర్పడింది.

ఈ పరిచయం ప్రేమగా మా రగా ఇరువురి తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లికి సి ద్ధమయ్యారు. ఇందులో భాగంగా జడ్చర్ల వచ్చిన వారు నెల క్రితమే రిజిస్టర్‌ పెళ్లి కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీపాల్‌ – వేర వెగాస్‌ లుకా వెలోజా జంటకు శుక్రవారం స్థానిక ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌ ఆంజనేయులు మ్యారేజ్‌ సర్టిఫికెట్‌ అందజేశారు. ఈ మేరకు వేర వెగాస్‌ లుకా వెలోజా మాట్లాడుతూ భారతదేశ సంస్కృతి, సం ప్రదాయాలు నచ్చడంతో తాను కుటుంబ సభ్యులను ఒప్పించి శ్రీపాల్‌ను వివాహం చేసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నూతన జంటను శ్రీపాల్‌ తల్లిదండ్రులు వెంకట్‌రెడ్డి – రమాదేవితో పాటు కుటుంబ సభ్యులు ఆశీర్వదించారు.

 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా