మైనర్లే కానీ.. కరుడుగట్టిన దొంగలు

22 Dec, 2019 10:47 IST|Sakshi

సాక్షి, జగద్గిరిగుట్ట : దోపిడీలు, దొంగతనాలు చేస్తున్న ఇద్దరు మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకొని వారి నుంచి రూ. 5.69 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. శనివారం బాలానగర్‌ ఏసీపీ పురుషోత్తమ్‌ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. సూరారం కాలనీ దయానంద్‌నగర్‌ కాలనీకి చెందిన ఇద్దరు మైనర్లు 917,14) తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్‌ చేసి దొంగతనాలు చేస్తుంటారు. జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఇటీవల నాలుగు ఇళ్లలో చోరీలు చేశారు. సీసీ కెమెరాలు తదితర ఆధారాలతో కేసులను విచారించి ఈ ఇద్దరిని గుర్తించారు. దీంతో వారిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ. 4.80 వేలు విలువ చేసే బంగారం, రూ. 84 వేల విలువ చేసే రెండు కేజీల వెండితో పాటు రూ. 5వేలు స్వాధీనం చేసుకున్నారు. 

మైనర్‌.. నోఫియర్‌..
పట్టుబడిన ఇద్దరు మైనర్లు 2018 నుంచి దొంగతనాలకు పాల్పడడంతో వివిధ పోలీస్‌ స్టేషన్‌లలో కేసులు నమోదు అయ్యాయి. వీరిలో ఒకరిపై (17) బాలానగర్‌ పీఎస్‌లో రెండు, శామీర్‌పేట పీఎస్‌లో ఒకటి, జీడిమెట్ల పీఎస్‌లో ఒకటి, పేట్‌ బషీరాబాద్‌ పీఎస్‌లో రెండు, జగద్గిరిగుట్ట పీఎస్‌లో రెండు చొప్పున మొత్తం 8 దొంగతనం కేసులు ఉన్నాయి. మరొకరి(14)పై జగద్గిరిగుట్ట పీఎస్‌లో రెండు దొంగతనం కేసులు నమోదు అయ్యాయి.
 
ఐవో టీమ్‌కు రివార్డు..
దొంగతనాల కేసులను చాలెంజ్‌గా తీసుకున్న జగద్గిరిగుట్ట, జీడిమెట్ల డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ సుమన్‌కుమార్‌, జగద్గిరిగుట్ట ఎస్సై మహబూబ్‌పాటిల్‌లు తమ క్రైమ్‌ టీమ్‌తో సుదీర్ఘంగా విచారించి చాకచక్యంగా కేసులను ఛేదించారు. వీరితో పాటు క్రైమ్‌ సిబ్బంది సత్యనారాయణ, అర్జున్‌, విజయ్‌, హరిలాల్‌కు రివార్డులను అందించనున్నట్టు ఏసీపీ పురుషోత్తమ్‌, జగద్గిరిగుట్ట సీఐ గంగారెడ్డిలు తెలిపారు. 

మరిన్ని వార్తలు