జాప్యం జరిగింది... వాస్తవమే: జగదీష్రెడ్డి

25 Nov, 2014 11:15 IST|Sakshi
జాప్యం జరిగింది... వాస్తవమే: జగదీష్రెడ్డి

హైదరాబాద్: రాష్ట్రంలోని పాఠశాలు అన్నింటికీ సరైన సమయంలోనే పాఠ్యపుస్తకాలు అందజేశామని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీష్రెడ్డి వెల్లడించారు. మంగళవారం తెలంగాణ శాసనసభలో కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్రెడ్డి అడిగిన ప్రశ్నలకు జగదీష్ రెడ్డి సమాధానమిస్తూ... సామాజిక శాస్త్రం పుస్తకాలు ఇవ్వడంలో జాప్యం జరిగిన మాట వాస్తవమేనని ఆయన తెలిపారు. కొన్ని కార్పొరేట్ సంస్థలు పుస్తకాలను అధిక ధరలకు విక్రయిస్తున్నాయని చెప్పారు. అధిక ధరలను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటామని జగదీష్రెడ్డి సభకు హామీ ఇచ్చారు.

అంతకుముందు కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్రెడ్డి సభలో ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. రాష్ట్రంలో పుస్తకాల అమ్మకాలు తగ్గుతున్నాయని ఆందోళన చెందారు. పుస్తకాలు ధర మాత్రం గణనీయంగా పెరుగుతున్నాయని... ఈ నేపథ్యంలో పేద విద్యార్థులపై పుస్తకాల కొనుగోళ్లలో అధిక భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన విద్యార్థులకు ఇంతవరకు పుస్తకాలు అందలేదన్నారు. నకిలీ పుస్తకాల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో వెల్లడించాలని వంశీచంద్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీంతో విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డిపై విధంగా సమాధాన మిచ్చారు.

మరిన్ని వార్తలు