దమ్ముంటే ఎమ్మెల్యేగా రాజీనామా చేయాలి 

24 Mar, 2019 03:13 IST|Sakshi

ఉత్తమ్‌కు మంత్రి జగదీశ్‌రెడ్డి సవాల్‌

నల్లగొండ రూరల్‌: పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి దమ్ము, ధైర్యం ఉంటే ముందు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని, లేకుంటే ఓటమి అంగీకరించినట్లు ఒప్పుకోవాలని విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి సవాలు చేశారు. శనివారం ఆయన నల్లగొండ జిల్లాకేంద్రంలో జరిగిన టీఆర్‌ఎస్‌ నల్లగొండ పార్లమెంట్‌ నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాట్లాడారు. పీసీసీ చీఫ్‌ దద్దమ్మ అని, చేతకాని వ్యక్తి అని.. అనేకసార్లు కాంగ్రెస్‌ నాయకులే బాహాటంగా ప్రకటించారని జగదీశ్‌రెడ్డి గుర్తు చేశారు. గత నాలుగున్నరేళ్ల పాలనలో ఏ ఒక్క రాజకీయ నాయకుడిని తాను వ్యక్తిగతంగా విమర్శించలేదన్నారు. నల్లగొండలో ప్రజలు తిరస్కరిస్తే భువనగిరికి పారిపోయిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెల్లని రూపాయి అని, భువనగిరిలో ఆ రూపాయి ఎలా చెల్లుతుందని ప్రశ్నించారు. భువనగిరి ప్రజలు కూడా కోమటిరెడ్డికి తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని మంత్రి అన్నారు. 

మరిన్ని వార్తలు