కరోనా ఎఫెక్ట్‌: కాశీలో చిక్కుకున్న భక్తులు 

23 Mar, 2020 08:20 IST|Sakshi
కాశీలో చిక్కుకున్న జగిత్యాలకు చెందిన భక్తులు

సాక్షి, జగిత్యాల: ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు భక్తులు ఉత్తరప్రదేశ్‌లోని కాశీలో చిక్కుకున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ఎక్కడికక్కడే కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో కాశీకి వెళ్లినవారు ఇక్కడికి రాలేక.. అక్కడ ఉండలేన నానా యాతన పడుతున్నారు. ఈ యాత్రలో జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలకు చెందిన 71 మంది మార్చి 13న కాశీ విహారయాత్రకు బయలుదేరారు. వీరు మార్చి 23న ఆయా జిల్లాలకు చేరుకోవాల్సి ఉంది. (అనుమానితులకు కరోనా స్టాంప్‌)

కానీ ఆదివారం 22వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా రైళ్లు, విమాన, బస్సుల రాకపోకలు నిషేధించడంతో పలువురు ఉమ్మడిజిల్లావాసులు కాశీలో చిక్కుకున్నారు. దీంతో వారి కుటుంబీకులు స్వగ్రామాల్లో ఆందోనన చెందుతుండగా, యాత్రకు వెళ్లిన వారు అక్కడ బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు. యాత్రకు వెళ్లిన వారిలో జగిత్యాల మండలం పోరండ్ల గ్రామానికి చెందిన 14 మంది ఉండటంతో గ్రామంలో ఆందోళన నెలకొంది.

   

మరిన్ని వార్తలు