ముగిసిన జైపాల్‌రెడ్డి అంత్యక్రియలు..

29 Jul, 2019 15:28 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి అంత్యక్రియలు కొద్దిసేపటి క్రితం ముగిశాయి. నెక్లెస్‌ రోడ్డులోని పీవీ ఘాట్‌ సమీపంలో ప్రభుత్వ లాంఛనాలతో జైపాల్‌రెడ్డి అంత్యక్రియలు జరిగాయి. కుటుంబసభ్యులు, అభిమానుల, పలువురు రాజకీయ నాయకులు కడసారి ఆయనకు అశ్రునయనాలతో నివాళులర్పించారు. అంతిమయాత్రకు పెద్ద ఎత్తున​ తరలివచ్చిన అభిమానులు ఆయనకు తుది వీడ్కోలు పలికారు. ఆయనకు గౌరవ సూచకంగా పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. అనంతరం జైపాల్‌రెడ్డి పార్థివదేహానికి ఆయన పెద్ద కుమారుడు అరవింద్‌ రెడ్డి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. 

కాగా, జైపాల్‌రెడ్డి అనారోగ్యంతో ఆదివారం తెల్లవారు జామున కన్నుమూసిన విషయం విదితమే. సోమవారం ఉదయం జూబ్లీహిల్స్‌లోని జైపాల్‌రెడ్డి నివాసం నుంచి గాంధీభవన్‌కు ఆయన భౌతికకాయాన్ని తరలించారు. అనంతరం అక్కడి నుంచి నెక్లెస్‌ రోడ్డు వరకు జైపాల్‌రెడ్డి అంతిమయాత్ర సాగింది. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు గులాం నబీ ఆజాద్‌, సిద్ధరామయ్య, కేఆర్‌ రమేశ్‌కుమార్‌, మల్లికార్జున ఖర్గేలు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వీహెచ్‌, గీతారెడ్డి, మధుయాష్కి, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ఎమ్మెల్యే హరీశ్‌రావు,  జైపాల్‌రెడ్డి అంత్యక్రియలకు హారయ్యారు.


 

మరిన్ని వార్తలు