అగ్రకులాలకింద ఎన్నాళ్లీ రాజకీయ గులాంగిరి

12 Aug, 2018 12:39 IST|Sakshi
మునుగోడు : బస్సుయాత్రలో మాట్లాడుతున్న బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్

రాష్ట్రంలో  బీసీ జనాభా అధికంగా ఉన్నా రాజకీయంగా అథమంలో ఉన్నారని, వారంతా చైతన్యం కావాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ పిలుపునిచ్చారు. బీసీలకు రాజకీయ అవకాశాలు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ  చేపట్టిన బస్సు చైతన్యయాత్ర శనివారం డిండి, దేవరకొండ, కొండమల్లేపల్లి, చండూరు, మునుగోడు మండలాల్లో సాగింది. ఈ సందర్భంగా ఆయనకు స్థానిక బీసీ నాయకులు స్వాగతం పలికారు.

దేవరకొండ / మునుగోడు : దేశంలో ఉన్న బీసీ కులస్తులంగా చైతన్యవంతం కావాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. ఎన్నికల సమయంలో అగ్రకులాల నాయకులకు ఓట్లు వేయకుండా, బీసీ అభ్యర్థులకు మాత్రమే ఓట్లు వేసిన రోజునే బీసీల బతులకు మారుతాయని అన్నారు. పంచాయతీ నుంచి పార్లమెంట్‌ వరకు బీసీలకు రాజకీయ అవకాశాలు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ ఐదు రోజుల క్రితం పాలమూరు జిల్లాలో ప్రారంభించిన బస్సు యాత్ర శనివారం సాయంత్రం జిల్లాలోకి ప్రవేశించింది. ఈ యాత్ర జిల్లాలో దేవరకొండ, కొండమల్లేపల్లి, మునుగోడు, చండూరు మండల కేంద్రాల్లో కొనసాగింది. ఈ సందర్భంగా ఆయా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సభల్లో జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడారు. కొన్నేండ్ల నుంచి అగ్రకులాల నాయకులు బీసీల చేత చేయించుకుంటున్న రాజకీయ గులాంగిరీలని అంతమొందించేందుకే ఈ బస్సుయాత్ర నిర్వహిస్తున్నామని అన్నారు. ఇప్పటి వరకు తమ ఆధిపత్య పోరుతో ఎంపీ, ఎమ్మెల్యేలుగా చెలామనీ అవుతున్న దొరలకు రానున్న 2019 ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలన్నారు.

ప్రాణాలను త్యాగం చేసైనా రాష్ట్ర వ్యాప్తంగా 60 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలని గెలిపించుకుంటామన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణ త్యాగాలు, ఆందోళనలు, ధర్నాలు చేసినా బీసీలకు ఎలాంటి న్యాయం జరుగలేదన్నారు. మళ్లీ దొరలు పదువులను దక్కించుకుని విద్యా, రాజకీయంగా అణచివేస్తున్నారన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాలకు 2009 ఎన్నికల వరకు కేవలం ఒకే ఒక్క బీసీకి ఎమ్మెల్యేగా అవకాశం వస్తుందన్నారు. 2014లో అదికూడా లేకుండా పోయిందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 6 ఎమ్మెల్యేలతో పాటు ఎంపీని గెలిపించుకునేందుకు బీసీలంతా నడుం బిగించాలని కోరారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ ఫెడరేషన్‌ పేరు మీద రుణాలు అందించాలని కోరారు. రాష్రంలో 56శాతం ఉన్న బీసీలకు ఉన్నత పదవులు దక్కకుండా కేవలం 5శాతం ఉన్న అగ్రకులాల వారు అందల మెక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కార్యక్రమాల్లో బూడిద లింగయ్యయాదవ్, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వంగాల స్వామిగౌడ్, రిటైడ్‌ ఐఏఎస్‌ చొల్లేటి ప్రభాకర్, కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకుడు నారబోయిన రవి, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి నెల్లికంటి సత్యం, టీఆర్‌ఎస్‌ జిల్లా కార్యదర్శి గుర్రం సత్యం, బొడ్డు నాగరాజుగౌడ్, గుంటోజు వెంకటాచారి, బీజేపీ మండల అధ్యక్షుడు బొడిగె అశోక్‌గౌడ్, డోల్‌దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు మాలిగ యాదయ్య, నర్సింహాచారి, పానుగంటి విజయ్‌గౌడ్, బూడిద మల్లికార్జున్‌యాదవ్, క్రిష్ణ, లాస్‌గౌడ్, సాగర్ల లింగస్వామి, జాజుల భాస్కర్‌గౌడ్, సరికొండ జనార్దన్‌రాజు, గుంజ కృష్ణయ్య, నేతాళ్ల వెంకటేష్‌యాదవ్, ఎన్‌ఎన్‌.చారి, పున్న శైలజ, గుర్రం విజయలక్ష్మి, ఇడికుడ అలివేలు, చేరిపల్లి జయలక్ష్మి, పగిడిమర్రి సంపూర్ణ, సుజాత, శిరందాసు కృష్ణయ్య, వనం చంద్రమౌళి, ముచ్చర్ల ఏడుకొండలు, విజయ్, మురారి, రాఘవాచారి, చింతపల్లి పుల్లయ్య, జ్యోతిబసు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు