‘ఇంజనీరింగ్‌’ ఫీజులు పెంచకుండా చూడండి

30 Jun, 2019 02:51 IST|Sakshi

అడ్మిషన్, ఫీ రెగ్యులేటరీ కమిటీ చైర్మన్‌ జస్టిస్‌ స్వరూపరెడ్డిని కోరిన జాజుల

సాక్షి, హైదరాబాద్‌: ఇంజనీరింగ్‌ కాలేజీలు ఫీజులను పెంచకుండా చర్యలు తీసుకోవాలని, పేద విద్యార్థులకు అన్యాయం జరగకుం డా చూడాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ కోరారు. ఈ మేరకు తెలంగాణ అడ్మిషన్, ఫీ రెగ్యులేటరీ కమిటీ చైర్మన్‌ జస్టిస్‌ స్వరూపరెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు. ప్రస్తుతం దేశంలో ఏక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో ఫీజును ఒకేసారి 40 శాతానికి పెంచుతున్నారన్నారు. దీంతో పేద బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు తీర్పును అడ్డం పెట్టుకుని ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేసేందుకు కొన్ని ప్రైవేటు కళాశాలలు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు.

వార్షిక ఫీజు కాకుండా, స్పెషల్‌ ఫీజు, యూనివ ర్సిటీ, అడ్మిషన్, రిజిస్ట్రేషన్‌ ఫీజు పేరుతో వేల రూపాయలు అక్ర మంగా వసూలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఇంజనీరింగ్‌ కాలేజీ లు ఫీజులు పెంచినా ప్రభుత్వం మాత్రం రూ.35 వేలు మాత్రమే ఇస్తుం దన్నారు. విద్య అనేది సామాజిక సేవ అనే భావనను తప్పించి ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీల యజమాన్యాలు వ్యాపారం చేస్తు న్నాయన్నారు. ఇప్పటి వరకు ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ చేపట్టకుండా, కోర్టు తీర్పు కోసం ప్రభుత్వం ఎదురు చూడటం వల్ల విద్యార్థులు విద్యా అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉందని, తక్షణమే కౌన్సెలింగ్, వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభించాలన్నారు. యాజమాన్య కోటా సీట్లను ఆన్‌లైన్‌ ద్వారా భర్తీ చేయాలని కోరారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు