సర్వే గురించి మాట్లాడం హాస్యాస్పదం

29 May, 2017 17:22 IST|Sakshi
సర్వే గురించి మాట్లాడం హాస్యాస్పదం

హైదరాబాద్‌: అన్ని సమస్యలను పక్కన పెట్టి రెండు ఏండ్ల తర్వాత వచ్చే ఎన్నికల  సర్వేల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని సీఎల్పీ నేత జానారెడ్డి అన్నారు.  అసెంబ్లీ మీడియా పాయింట్‌ లో  విలేకరులతో మాట్లాడుతూ..సమస్యలు దాటవేసి..ఎప్పుడో వచ్చే ఎన్నికల ముఖ్యమా లేక ప్రజా సమస్యలు ముఖ్యమా ప్రభుత్వం ఆలోచించాలన్నారు. సర్వేల పేరు చెప్పి ప్రజలను పక్క దారి పట్టిస్తున్నారని ఆరోపించారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంపై దృష్టి పెట్టాలని ప్రభుత్వానికి సూచించారు. ప్రభుత్వంలో ఉన్నా, లేకున్నా ప్రజా సమస్యలపై  పోరాటం చెయ్యడమే మా ధ్యేయమన్నారు.

టీడీపీతో పొత్తు అసందర్భ విషయమని తెలిపారు. జైపాల్ రెడ్డి మాట్లాడిన విషయంపై వక్రీకరణ చేసారేమో అని అనుమానంగా ఉందన్నారు. తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా..జూన్ ఒకటిన సంగారెడ్డిలో సభ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మూడు ఏండ్లుగా దేశంలో, రాష్ట్రంలో రైతాంగ పరిస్థితులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల హామీల అమలు నిర్లక్ష్యంపై రాహుల్‌ గాంధీ ప్రజలకు వివరిస్తారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రాహుల్ సభకు వేలాదిగా తరలి రావాల్సిందిగా సీఎల్పీ తరపున ప్రజలను కోరారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు