రాజకీయాల్లో నా స్టైల్‌ నాకుంది

29 Dec, 2016 00:56 IST|Sakshi

నా పనితీరు బాగోలేదని ఎవరూ అన్లేదు: జానారెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: శాసనసభలో తన పనితీరు బాగోలేదని ఎవరూ చెప్పలేదని సీఎల్పీ నేత కె.జానారెడ్డి పేర్కొన్నారు. బుధవారం సీఎల్పీ కార్యాలయంలో తనను కలసిన విలేకరులతో ఆయన మాట్లాడారు. ‘సీఎల్పీ పనితీరు బాగాలేదని, మారుస్తారని మీడియాలో రాసే రాతలకు భయపడను, బాధపడబోను. పెద్ద మనిషి తరహాలో నేను సీఎల్పీ నేతగా వ్యవహరిస్తున్నా. ఇప్పటి పోటీ రాజకీయాలకు నేను సరిపోననే అభిప్రాయం కొందరికి ఉంటే ఉండొచ్చు. రాజకీయాల్లో ఎలా పనిచేయాలనే దానిపై నాకో స్టైల్‌ ఉంది.

పార్టీ వ్యూహాలు, ఎత్తుగడలు పరిస్థితులను బట్టి మారుతుంటాయి. వాటిని ఎమ్మెల్యేలైనా, ఇంకెవరైనా ముందుగానే లీక్‌ చేయడం సరికాదు. నా పని తీరు బాగాలేదని ఎవరూ నాతో చెప్పలేదు’ అని పేర్కొన్నారు. సీఎల్పీ పదవిపై ఎవరికైనా ఆసక్తి ఉంటే చెప్పాలని తమ ఎమ్మెల్యేలకు ముందుగానే సూచించానన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా