ఆర్టీసీ సమ్మెపై పవన్‌ కీలక వ్యాఖ్యలు

14 Oct, 2019 14:01 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు జనసేన పార్టీ మద్దతు తెలిపింది. జనసేన పార్టీ ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటుందని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. సమ్మె చేపట్టిన 48 వేల మంది కార్మికుల ఉద్యోగాలను తొలగిస్తున్నామని ప్రభుత్వం చెప్పడం సరికాదన్నారు. అభద్రతా భావంతోనే ఉద్యోగులు చనిపోతున్నారని అభిప్రాయపడ్డారు. సమ్మెకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ సమ్మె, తాజా పరిస్థితులపై ఆయన సోమవారం పార్టీ నాయకులతో హైదరాబాద్‌లోని జనసేన కార్యాలయంలో సమీక్ష జరిపారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 19న ఆర్టీసీ కార్మికుల జేఏసీ తలపెట్టిన రాష్ట్ర బంద్‌కు తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. బంద్‌ సందర్భంగా ఎలాంటి హింసకు తావులేకుండా.. శాంతియుత నిరసనలు చేపట్టాలని కోరారు. ఖమ్మంలో శ్రీనివాస్‌రెడ్డి, రాణిగంజ్ డిపోకు చెందిన సురేందర్‌ గౌడ్‌లు బలవన్మరణానికి పాల్పడటం సమ్మె తీవ్రతను తెలియజేస్తుందని అన్నారు. కార్మికుల డిమాండ్లు ఎంతవరకు ఆమోదయోగ్యం అనే అంశాన్ని పక్కనబెట్టి వారి ఆవేదనను అర్థం చేసుకోవాలని కోరారు. ఒకే సారి 48వేల మంది ఉద్యోగులను తొలగించడం తనకు బాధ కలిగించిందని చెప్పారు. ఇలా చేయడం ఉద్యోగ భద్రతను ప్రశ్నార్థకం చేస్తుందన్నారు. ప్రభుత్వం కార్మికులతో చర్చలు జరిపి.. వారి డిమాండ్లను సామరస్యపూర్వకంగా పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘ప్రభుత్వం చర్చలకు పిలుస్తే మేము సిద్ధం’

హైదరాబాద్‌ వస్తా.. ఘెరావ్‌ చేస్తా

సీఎంతో పాటు ముగ్గురు మంత్రులపై ఫిర్యాదు

‘కళ్లల్లో పెట్టుకుని చూసుకున్నా.. మళ్లీ ఆయన నాకు కావాలి’

ఆర్టీసీ సమ్మె : ప్రయాణికుడి కాలుపైకి ఎక్కిన బస్సు

నిజామాబాద్‌లో ఉన్మాది ఆత్మహత్య

ప్రేమ వివాహం.. అల్లుడిపై దాడి చేసిన మామ

అమాయకత్వం ఆసరాగా నిలువెత్తు మోసం

సురేందర్‌ మృతదేహానికి లక్ష్మణ్‌ నివాళి

ఉందిగా అద్దె బైక్‌..

తూచ్‌.. కథ అడ్డం తిరిగింది!

నిరుపయోగంగా జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం, వాంబే గృహాలు

ఆర్టీసీ సమ్మె : సూర్యాపేట డిపో దగ్గర ఉద్రిక్తత

మందుల దుకాణాల్లో మాయాజాలం

రాజుకున్న రాజకీయ వేడి 

మన జూకు విదేశీ వన్యప్రాణులు!

కొలువులు కొట్టడంలో దిట్టలు ఓయూ విద్యార్థులు

ఐక్యంగా ముందుకు సాగుదాం

కేసీఆర్‌ను అభినందిస్తున్నా: కేశవరావు

రెండు ఆర్టీసీ బస్సులు ఢీ.. డ్రైవర్‌పై దాడి

ఖమ్మం బంద్‌ : డిపోలకే పరిమితమైన బస్సులు

రెండేళ్ల నిరీక్షణకు తెర

మద్దతు కోరనప్పుడు ఎలా ఇస్తాం?

సమైక్యాంధ్రలోనే మొదలు

ఆర్‌.నారాయణమూర్తికి జాతీయ అవార్డు 

తెలంగాణ ఆర్టీసీ సమ్మె ఉధృతం

సోషల్‌ చెత్తకు చెక్‌

కొత్త మార్గదర్శకాలెక్కడ?

విలువలు, విజ్ఞాన పరిరక్షణ బాధ్యత అందరిదీ: హరీశ్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నో సాంగ్స్‌, నో రొమాన్స్‌.. జస్ట్‌ యాక్షన్‌

ఆ సినిమాను అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్‌లలో చూడలేరు

కొత్త సినిమాను ప్రారంభించిన యంగ్‌ హీరో

‘జెర్సీ’ రీమేక్‌ కోసం భారీ రెమ్యునరేషన్‌!

చిరంజీవిగా చరణ్‌?

వార్‌ దూకుడు మామూలుగా లేదు..