ఏపీ, తెలంగాణ సరిహద్దు మూసివేత

22 Mar, 2020 08:07 IST|Sakshi

సాక్షి, ఖమ్మం: కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ‘జనతా కర్ఫ్యూ’కు దేశ వ్యాప్తంగా భారీ స్పందన వస్తోంది. తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్‌ తెలంగాణాల్లో జనజీవనం స్తంభించిపోయింది. రోడ్డు రవాణా వ్యవస్థపై ఆంక్షలు విధించడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో కోదాడవద్ద ఆంధ్రప్రదేశ్‌ తెలంగాణ సరిహద్దు (హైదరాబాద్‌-విజయవాడ హైవే)ను సైతం ఆదివారం ఉదయం మూసేశారు.


మహారాష్ట్ర సరిహద్దు బంద్‌..
మహారాష్ట్ర మనకు పొరుగు రాష్ట్రం కావడం పెద్ద భయం. అక్కడ కోవిడ్‌–19 బాగా పెరుగుతోంది. మహారాష్ట్రతో మనకు ఐదారు వంద కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ఆదిలాబాద్, నిజామాబాద్‌ జిల్లాల ప్రజలకు మహారాష్ట్రలోని ధర్మాబాద్, నాందెడ్‌ వంటి ప్రాంతాల్లో ఎక్కువ బంధుత్వాలున్నాయి. మహారాష్ట్రలో వ్యాధి తీవ్రతపై ఒకటి రెండు రోజుల్లో సమీక్ష నిర్వహించి ఆ రాష్ట్రంతో సరిహద్దులు మూసేయాలని ఆలోచిస్తున్నం. ఆ రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలకు ముందు చెప్పి సరిహద్దులు మూసేస్తం. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎవరూ రాకుండా రాష్ట్ర సరిహద్దులను మూసేస్తాం. ఇప్పటికే పొరుగు రాష్ట్రాల ఉన్నతాధికారులతో ప్రధాన కార్యదర్శి, డీజీపీ నిరంతరం టచ్‌లో ఉన్నారు. ఢిల్లీతో కూడా ఎప్పటికప్పుడు సమాచారాన్ని పంచుకుంటున్నాం. 

మరిన్ని వార్తలు