దండం పెడుతున్నాం.. రోడ్లపైకి రాకండి

20 Apr, 2020 13:23 IST|Sakshi
వాహనదారుడికి దండంపెడుతున్న పోలీసులు

జనగామ: కరోనా వైరస్‌ ప్రమాద స్థాయిలో ఉంది.. మనం సేఫ్‌గా ఉన్నా లాక్‌డౌన్‌ను విజయవంతం చేస్తేనే భవిష్యత్‌లో బాగుంటాం.. లాఠీతో మర్యాదచేసినం, కేసులు పెట్టి హెచ్చరించినం.. రెండు చేతులా దండంపెడుతున్నాం.. దయచేసి రోడ్లపైకి రాకండి అంటూ జనగామ పోలీసులు వేడుకుంటున్న తీరు ప్రజలను మేలుకొలుపుతుంది. జిల్లా కేంద్రంలోని నెహ్రూపార్కు చెక్‌పోస్టు వద్ద బందోబస్తు నిర్వహిస్తున్న ఎస్సై శ్రీనివాస్, సిబ్బంది ద్విచక్రవాహనంపై వస్తున్న వ్యక్తిని ఆపి, దండం పెడుతూ అనవసరంగా బయటకు రావద్దని విజ్ఞప్తి చేసి మాస్క్‌లు లేకుండా తిరగవద్దని సూచించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు