అంకితభావంతో పని చేయండి

11 Apr, 2016 01:30 IST|Sakshi

ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ (టాస్క్)లో శిక్షణ పొంది, వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించిన 75 మందికి ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ నియామక పత్రాలను అందజేశారు. బేగంపేట్‌లోని టాస్క్ కార్యాలయంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో జయేశ్ రంజన్ మాట్లాడుతూ, అంకితభావంతో పని చేయాలని ఉద్యోగులకు సూచించారు. టాస్క్ సీఈవో సుజీవ్ నాయర్ మాట్లాడుతూ, వివిధ సబ్జెక్టుల్లో ఐటీఐ/పాలిటెక్నిక్ కోర్సులు పూర్తి చేసిన 2 వేల మందికి ఇప్పటివరకు శిక్షణ ఇచ్చామని, రెజుల్యూట్, జిప్పర్ డాట్‌కామ్, బీమ్ టెలికామ్, ప్లాన్‌మాన్ తదితర సంస్థల్లో 200 మందికి ఉద్యోగాలు లభించాయన్నారు. మరో 300 మందికి ఉద్యోగాలు ఇచ్చేందుకు రెజుల్యూట్ సంస్థ అంగీకరించిందని, వారంలోగా 50 మందికి నియామక ఉత్తర్వులిస్తారని తెలిపారు. కార్యక్రమంలో రెజుల్యూట్ ఎలక్ట్రానిక్స్ ఎండీ రమీందర్ సింగ్, ఎలక్ట్రానిక్స్ డెరైక్టర్ సుజయ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు