సీబీఐకి అప్పగిస్తే బండారం బయలు

31 Dec, 2016 05:25 IST|Sakshi
సీబీఐకి అప్పగిస్తే బండారం బయలు

సాక్షి, హైదరాబాద్‌: నయీంతో సంబందాలున్న టీఆర్‌ఎస్‌ నాయకుల బండారం బయటపడుతుందనే కేసును నీరుగారుస్తున్నారని సీఎల్పీ ఉపనాయకుడు జీవన్‌రెడ్డి విమర్శించారు. కేసును సీబీఐకి అప్పగిస్తే అందరి బండారం బయటపడుతుందన్నారు. అసెంబ్లీ మీడియాపాయింట్‌ దగ్గర శుక్రవారం మాట్లాడుతూ..  కోర్టుకు హోం శాఖ ఇచ్చిన నివేదిక ప్రకారం రాజకీయ నాయకులకు సంబంధాల్లేవన్నారని.. అయితే సిట్‌ విచార ణలో రాజకీయ నాయకులకు సంబంధాలు న్నాయని లీకులిచ్చారని.. గ్యాంగ్‌స్టర్‌ నయీం తో అంటకాగిన వారిని వదిలిపెట్టేది లేదని ప్రకటించిన సీఎం కేసీఆర్‌ దీనికి ఏం సమాధా నం చెబుతారని ప్రశ్నించారు.

శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌కు కూడా సంబంధాలున్నట్టుగా వార్తలు వచ్చాయని జీవన్‌రెడ్డి అన్నారు. శాసనసభ జరుగుతున్న తీరు సరిగాలేదని, సభను అధికారపక్షం ఏక పక్షంగా నిర్వహిం చుకుంటోందని జీవన్‌రెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ పార్టీ సూచించిన అంశాలపై చర్చ జరుగకుండా, ప్రభుత్వం నిర్దేశించిన అంశా లపై, వారు చెప్పిన వరకే మాట్లాడాలంటే సభకు వెళ్లడం ఎందుకని ఆయన ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు