బడుగు, బలహీన వర్గాలపైనే దాడులు..

10 Dec, 2019 17:12 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న దారుణ ఘటనలు ప్రభుత్వ వైఫల్యం, పోలీస్ నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి విమర్శించారు. ఇలాంటి దారుణాలకు కారణమైన మద్యాన్ని ప్రభుత్వం ఆదాయ మార్గంగా చూస్తూ మరింత ప్రోత్సహిస్తుందని మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో పోలీసులు కేవలం అధికార పార్టీ నేతల సేవల్లో తరిస్తున్నారని ఎద్దేవా చేశారు. దిశ కుటుంబ సభ్యులు పోలీసులను సంప్రదించగానే స్పందించి ఉంటే ఇంత దారుణం జరిగేది కాదన్నారు. రాష్ట్రంలో దళితులు, బలహీన వర్గాలకు చెందిన మహిళలపై దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దిశ ఘటనతోపాటు అన్ని కేసులపై సిట్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. దిశ కేసుపై జ్యుడిషియల్‌ విచారణ జరిపించాలన్నారు. ఇలాంటి ఘటనలపై త్వరిత విచారణ కోసం శాశ్వత ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టును ఏర్పాటు చేయాలని జీవన్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు