సీఎం బ్యాంకర్లతో సమావేశం నిర్వహించాలి: జీవన్‌రెడ్డి

4 Jul, 2017 20:02 IST|Sakshi
సీఎం బ్యాంకర్లతో సమావేశం నిర్వహించాలి: జీవన్‌రెడ్డి

జగిత్యాల: రైతుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని సీఎం కేసీఆర్‌ యుద్ధప్రతిపాదికన బ్యాంకర్లతో సమావేశం నిర్వహించాలని సీఎల్పీ ఉపనేత  జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా రాయికల్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ సీఎం పదవీ చేపట్టినప్పటి నుంచి ఒక్కసారి కూడా ఎస్‌ఎల్‌బీసీ సమావేశం నిర్వహించిన దాఖలు లేవన్నారు. దేశంలోని అన్నిరాష్ట్రాల సీఎంలు ఎస్‌ఎల్‌బీసీ సమావేశాలు నిర్వహించి ప్రణాళికలు రూపొందిస్తారని,  కేసీఆర్‌ మాత్రం రైతుల సంక్షేమం కోసం బ్యాంకర్లతో సమావేశం నిర్వహించే తీరిక లేదని ఎద్దేవా చేశారు.

పెద్దనోట్ల రద్దుతో రైతులు ఇబ్బందులు పడుతున్నా సీఎం కేసీఆర్‌ మాత్రం అవేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం కావడంతో రైతులు డబ్బుల కోసం  అవస్థలు పడుతున్నారని, వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి రైతులకు డబ్బుల విషయంలో ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. పండించిన పంటకు వరిధాన్యానికి క్వింటాలుకు రూ.2 వేలు, మొక్కజొన్నకు రూ.2 వేలు, మిర్చికి రూ.12 వేలు, పసుపునకు రూ.12 వేలు, పప్పు దినుసులకు రూ.12 వేలు అందజేయాలన్నారు.

మరిన్ని వార్తలు