-

రివర్స్‌ పంపింగ్‌ ఎస్సారెస్పీ దాకా చేయాలి

9 Aug, 2017 01:46 IST|Sakshi
రివర్స్‌ పంపింగ్‌ ఎస్సారెస్పీ దాకా చేయాలి

రెండు లిఫ్టుల భారం తగ్గుతుంది: జీవన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్‌: మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం దాకా ఉపయోగిస్తున్న రివర్స్‌ పంపింగ్‌ విధానాన్ని ఎస్సారెస్పీ వరకు కొనసాగించాలని సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. మంగళవారం ఆయన ఇక్కడ మాట్లా డుతూ కాళేశ్వరం నుంచి రివర్స్‌ పంపింగ్‌తో తరలించడం ద్వారా వరద సమయంలో విద్యుత్‌ ఉత్పత్తికూడా కలిసి వస్తుందన్నారు.

ఈ ప్రతిపాదన ద్వారా 50 కిలోమీటర్ల కాలువ నిర్మాణం, అదనంగా రెండు లిఫ్ట్‌ల భారం తగ్గు తుందన్నారు. గోదావరి ద్వారా రివర్స్‌ పంపింగ్‌ను అమలు చేస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు కూడా వస్తా యన్నారు. అలాగే కడెంకు దిగువన మరో ప్రాజెక్టు నిర్మిస్తే మరింత ఉపయోగకరంగా ఉంటుందన్నారు. మల్లన్న సాగర్‌ నుంచి నిజాంసాగర్‌కు నీటి తరలింపుపై ప్రభుత్వమే నిర్ణయం మార్చుకోవడం సంతోషకరమన్నారు.

కోర్టుకెళ్లడమే తప్పంటే ఎలా?
మంత్రి హరీశ్‌రావుకు న్యాయవ్య వస్థపై గౌరవముందా అని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. కోర్టులకు ఎవరైనా వెళ్లొ చ్చునని, అయితే కోర్టులు ఏం తీర్పులు చెబుతున్నాయనేది ముఖ్య మన్నారు. భూసేకరణ చట్టం–2013 పక్కన పెట్టినందుకే బాధితులు కోర్టులకు వెళ్లారని చెప్పారు. కోర్టులకు వెళ్లడమే తప్పు అన్నట్టుగా సీఎం కేసీఆర్‌ మాట్లాడటం సరికాదని, ఇది న్యాయ వ్యవస్థను తప్పుపట్టే విధంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలు కోర్టు ధిక్కారమేనన్నారు. జీఎస్టీని అద్భుతం అని కేసీఆర్‌ పొగడ్తలు కురిపించినప్పుడు నిజాలే మిటో తెలియదా అని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు.  కేసీఆర్‌ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని పొన్నం ప్రభాకర్‌ దీక్షకు దిగితే అరెస్టు చేసి, దీక్షను భగ్నం చేయడం అప్రజాస్వామి కమని విమర్శించారు.

మరిన్ని వార్తలు