అది జరిగినప్పుడే అసలైన పల్లె ప్రగతి

13 Mar, 2020 18:23 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బెల్టు దుకాణాలు లేనప్పుడే నిజమైన పల్లెప్రగతి అని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. హోం, ఎక్సైజ్‌, పంచాయతీరాజ్‌ శాఖలు కలిసి ఈ దుకాణాల మీద దాడులు చేయాలన్నారు. శుక్రవారం ఆయన శాసన మండలిలో మాట్లాడుతూ.. గ్రామాల్లో బెల్టు దుకాణాలు తీసివేయాలని.. మద్యాన్ని అరికట్టాలన్నారు. పల్లె ప్రగతి మంచి కార్యక్రమమని కొనియాడారు. కానీ, ప్రతి ఊరికి ట్రాక్టర్‌ అవసరం లేకపోవచ్చని, దీనిపైన ప్రభుత్వం ఆలోచించాలని కోరారు. (‘మెట్రో’పై కిషన్‌రెడ్డిది అనవసర రాద్ధాంతం: కర్నె ప్రభాకర్‌)

బీజేపీ ఎమ్మెల్సీ రామ్‌చందర్‌ రావు మాట్లాడుతూ.. గ్రామాల్లో బహిరంగ మల విసర్జన లేకుండా మరుగుదొడ్లు నియమించాలని కోరారు. నగరాలు, పట్టణాలకు వలస వచ్చినవారు తిరిగి గ్రామాలకు వెళ్లే పరిస్థితి తీసుకురావాలని పేర్కొన్నారు. కేంద్రం.. గ్రామాలకు అనేక పథకాల ద్వారా నిధులు ఇస్తుందని తెలిపారు. అనంతరం టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ మాట్లాడుతూ రాష్ట్రం వచ్చిన తరువాత ప్రతి రోజు పండగనే జరుగుతుందన్నారు. పంచాయతీ రాజ్‌ శాఖకు నిధుల కేటాయింపు గతంలో రూ.13 వేల కోట్లు దాటలేదని, కానీ నేడు రూ.23 వేల కోట్లు కేటాయించిందని పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు