22న నిరుద్యోగులకు జాబ్‌మేళా

21 Nov, 2019 13:33 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, సికింద్రాబాద్‌: సికింద్రాబాద్‌ ప్రాంతంలోని నిరుద్యోగులైన యువతీయువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈనెల 22న జాబ్‌మేళా నిర్వహించనున్నట్టు జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్‌ కే.రవికుమార్‌ తెలిపారు. నగరపాలక సంస్థ నిరుద్యోగ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్‌ ఎస్‌పీ రోడ్డులోని హరిహర కళాభవన్‌ ఆడిటోరియంలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. 18 నుంచి 30 సంవత్సరాలలోపు వయసు కలిగి 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుకున్న అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చుని డిప్యూటీ కమిషనర్‌ తెలిపారు. ఇంర్వ్యూల్లో ఎంపికైన అభ్యర్థులకు ఆసక్తి ఉన్న కోర్సుల్లో ఉచితంగా శిక్షణలు ఇచ్చిన మీదట ఉద్యోగ అవకాశాలు చూపించనున్నట్టు చెప్పారు. కస్టమర్‌కేర్‌ ఎగ్జిక్యూటివ్‌లు, కంప్యూటర్‌ ఆపరేటర్లు, యానిమేటర్లు, సాఫ్ట్‌వేర్‌డెవలపర్లు, డొమెస్టిక్‌వాయిస్, ఆర్టిఫిషల్‌ ఇంటలిజెన్స్, ఎలక్ట్రీషిన్‌ తదితర కోర్సుల్లో శిక్షణలు ఇవ్వనున్నట్టు డీసీ చెప్పారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు 22న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు హరిహరకళాభవన్‌లో జరిగే ఇంటర్వ్యూలకు హాజరుకావాలని డీసీ కోరారు. మరిన్ని వివరాలకు 9705092502, 9010650188.   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఇక రెండు రోజులే..

ఇండోనేషియన్ల సహాయకులకు కరోనా నెగెటివ్‌

ఖైరతాబాద్‌లో జల్లెడ పట్టిన అధికారులు

కరోనా 'లాక్‌డౌన్‌'పై సీరియస్‌నెస్‌ ఏదీ?

వంటగ్యాస్‌ కొరత.. బిల్లు జనరేటర్‌ అవుతున్నా

సినిమా

కరోనా విరాళం

అంతా బాగానే ఉంది

నేను బాగానే ఉన్నాను

నిర్మాత ప్రసాద్‌ కన్నుమూత

అర్జున్‌.. అను వచ్చేశారు

ప్రపంచంలో ఎన్నో కష్టాలున్నాయి