నర్సింగ్‌లో ఉద్యోగావకాశాలు

7 May, 2015 03:16 IST|Sakshi

కరీంనగర్: హైదరాబాద్‌లోని నైటింగేల్ హోంహెల్త్ సర్వీసెస్‌లో యువతి, యువకులకు నర్సింగ్ అసిస్టెంట్‌లుగా ఉద్యోగ అవకాశాలున్నాయని డీఆర్‌డీఏ పీడీ అరుణశ్రీ ఒక ప్రకటనలో తెలిపారు. పదవతరగతి నుంచి ఏదైనా డిగ్రీ, ఏఎన్‌ఎం, జీఎన్‌ఎం చదివి ఉండి, 19 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు అర్హత గల వారు ఉద్యోగాలకు అర్హులని తెలిపారు. వేతనం 6 వేల నుంచి 13 వేల వరకు ఉంటుందని చెప్పారు. 8వ తేదీన పూర్తి వివరాలతో ఉదయం 10 గంటలకు ఈజీఎంఎం కార్యాలయం, అం బేద్కర్ స్టడీసర్కిల్‌లో జరిగే ఇంటర్వ్యూలకు హాజరు కావాలని కోరారు. వివరాలకు 8341516276 నంబర్‌కు సంప్రదించాలని సూచించారు.

మరిన్ని వార్తలు