గిరిజన యువతకు ‘జాబ్ పోర్టల్’

12 Dec, 2016 15:20 IST|Sakshi
గిరిజన యువతకు ‘జాబ్ పోర్టల్’

ప్రారంభించిన మంత్రి అజ్మీరా చందూలాల్
 
 సాక్షి,హైదరాబాద్: గిరిజన యువత ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు సరి కొత్త వేదిక ఏర్పాటైంది. హైదరాబాద్ ఐఐటీ విద్యార్థులు, గిరిజన సంక్షేమ శాఖ సంయుక్తంగా ప్రత్యేక వెబ్‌పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. శనివారం సచి వాలయంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ మంత్రి అజ్మీరా చందూలాల్ ఈ వెబ్‌సైట్... ఎస్‌టీఈసీ.తెలంగాణ.జీఓవీ.ఇన్‌ను ప్రారంభిం చారు. గిరిజన విద్యార్థులు మాత్రమే ఈ వెబ్‌పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దీంతో సదరు అభ్యర్థికి తాజా నోటిఫికేషన్లు, ప్రైవేటు రంగంలో ఉద్యోగావకాశాలు, శిక్షణ కార్యక్రమాలకు సంబంధించి న సమాచారం అందుతుంది. సంక్షిప్త, ఈమెరుుల్స్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం అందివ్వడంతో పాటు ఫోన్ ద్వారా కూడా యువతకు అవగాహన కల్పిస్తారు. ఇంటర్వ్యూలకు హాజరయ్యే వారిని సన్నద్ధపర్చే కార్యక్రమాల్ని సైతం వెబ్‌సైట్ నిర్వాహకులు చేపడుతున్నారు.  

 ఉద్యోగం వచ్చే వరకు...
 రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రతి అభ్యర్థికి ఉద్యోగావకాశం వచ్చే వరకు మార్గనిర్దేశం చేస్తామని హైదరాబాద్ ఐఐటీ ప్రొఫెసర్ నిశాంత్ తెలి పారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే అభ్య ర్థి ఈమెరుుల్‌కు పాస్‌వర్డ్ పంపుతారు. అనంతరం అభ్యర్థి అర్హతలను అందులో నిక్షిప్తం చేయాలి. వాటి ఆధారంగా ఉద్యోగాలకు సంబంధించిన సమాచారాన్ని చేరవేస్తారు. ఆర్థిక స్థోమత లేని అభ్యర్థులకు టీఏ, డీఏ సహకారాన్ని సైతం కల్పిస్తారు. అభ్యర్థి ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలు పోర్టల్‌లో ఎంట్రీ చేయాలి. నిరుద్యోగ గిరిజన యువతను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు డిక్కి (దళిత్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ) చేయూతనివ్వనుంది. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖతో ఇప్పందం కుదుర్చుకుంది. పెట్టుబడుల సహకారంతో పాటు యూనిట్ల స్థాపనకు సలహాలు సూచనలు ఇవ్వనున్నట్లు డిక్కి చైర్మన్ రవికుమార్ తెలిపారు.  

 గిరిజనులకు వరం: చందూలాల్
 ఈ వెబ్‌పోర్టల్ గిరిజన యువతకు వరంలాంటిది. దీన్ని సద్వినియోగం చేసుకోవా లి. త్వరలో ఆండ్రారుుడ్ జాబ్ యాప్‌ను తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటుంన్నాం.  

 10 వర్కింగ్ ఉమెన్ హాస్టళ్లు...
 ‘నగరాల్లో ఉద్యోగాలు చేసే గిరిజన యువతులకు నివాస సదుపాయం సమ స్యగా మారింది. దీన్ని అధిగమించేలా రాష్ట్రవ్యాప్తంగా 10వర్కింగ్ ఉమెన్ హాస్టళ్లను ప్రారంభించనున్నాం. అలాగే ఐఏఎస్ శిక్షణ కేంద్రాన్ని కూడా ప్రారంభిస్తాం’ అని శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సోమేశ్ కుమార్ వెల్లడించారు. 

మరిన్ని వార్తలు