ఉద్యోగ భద్రత కల్పించాలి

14 Mar, 2018 12:23 IST|Sakshi
గోడు వెల్లడుబోసుకుంటున్న కాంట్రాక్టు ఉద్యోగులు

సాక్షి, రంగారెడ్డి జిల్లా: గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌)లో పనిచేస్తున్న వారికి ఉద్యోగ భదత్ర కల్పించాలని సెర్ప్‌ జిల్లా జేఏసీ అధ్యక్షుడు నర్సింహులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పని ఒత్తిడితో ఉద్యోగులు అకాల మరణం చెందితే వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో సీసీగా పనిచూస్తూ గుండెపోటుతో మరణించిన అనంతరావుకు సెర్ప్‌ జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో మెయినాబాద్‌ మండలం చిలుకూరులోని మహిళా ప్రాంగణంలో రెండు నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా నర్సింహులు మాట్లాడుతూ.. ఏళ్లుగా సెర్ప్‌లో చాలీచాలని వేతనాలతో పనిచేస్తుండడం, కుటుంబ ఆర్థిక భారం, పని ఒత్తిడి పెరగడంతో మూడు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా ముగ్గురు సిబ్బంది మృతిచెందారని పేర్కొన్నారు. మరణించిన వారికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అలాగే బాధిత కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం కల్పిం చాలన్నారు. ప్రభుత్వం స్పందించి సెర్ప్‌ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించడంతోపాటు పే స్కేల్‌ని వర్తింపజేయాలన్నారు. 
 

మరిన్ని వార్తలు