‘తెలంగాణ వారికే ఉద్యోగాలు’

28 May, 2018 01:35 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో ఇక నుంచి తెలంగాణ ప్రాంతం వారికే ఉద్యోగావకాశాలు ఉంటాయని తెలంగాణ ఏఈఈల సంఘం హర్షం వ్యక్తంచేసింది. ఉమ్మడి ఏపీలో తెలంగాణ వాళ్లు మొత్తం ఉద్యోగాల్లో 25% రిక్రూట్‌ అయ్యేవాళ్లని ఆ సంఘం అధ్యక్షుడు చక్రధర్‌ అన్నారు. 5వ జోన్‌లో ఆదిలాబాద్‌ వాళ్లు, 6వ జోన్‌లో మహబూబ్‌నగర్‌ నుంచి 1% మాత్రమే రిక్రూట్‌ అయ్యేవారని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 7 జోన్‌లు చేయడం వల్ల ప్రతి ప్రాంతం నుంచి సమానంగా రిక్రూట్‌ అవుతారన్నారు.

ఇంతకుముందు 40% ఓపెన్‌ కోటాలో వేరే రాష్ట్రం వాళ్లు వచ్చే అవకాశం ఉండేది, కానీ ఇప్పుడు ఓపెన్‌ కోటా 5% కావడం వల్ల 95% ఉద్యోగాలు స్థానికులకే దక్కుతాయన్నారు. డీఎస్పీ, డీపీఆర్వో పోస్టులు రాష్ట్రస్థాయిగా రిక్రూట్‌మెంట్‌ జరిగేది. ఇప్పుడు మల్టీజోన్‌లో రిక్రూట్‌ అవడం వల్ల అన్ని ప్రాంతాలకు ప్రాధాన్యత కలుగుతుందన్నారు. తొలిసారిగా కేబినెట్‌ సమావేశానికి ఉద్యోగ సంఘ ప్రతినిధులను పిలిచి, వారి అభిప్రాయాలను గౌరవించడం మంచి పరిణామమన్నారు.   

మరిన్ని వార్తలు