భూపాలపల్లి కలెక్టర్‌పై చర్యలు: జోగురామన్న

26 Mar, 2017 02:47 IST|Sakshi
భూపాలపల్లి కలెక్టర్‌పై చర్యలు: జోగురామన్న

శాసనమండలిలో మంత్రి ప్రకటన
సాక్షి, హైదరాబాద్‌: వన్యప్రాణుల చట్టం ప్రకారం భూపాలపల్లి కలెక్టర్‌ మురళిపై చర్యలు తీసుకుంటామని అటవీ శాఖ మంత్రి జోగురామన్న ప్రకటించారు. శనివారం శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో బీజేపీ సభ్యుడు రామచందర్‌రావు మాట్లాడుతూ.. అడవి పందులను పట్టుకొని తినమంటూ స్థానిక ప్రజలకు కలెక్టర్‌ మురళి పిలుపునివ్వడాన్ని ప్రస్తావించారు. దీనికి జోగురామన్న స్పందిస్తూ.. వన్యప్రాణుల చట్టం ప్రకారం మురళిపై చర్యలు తీసుకోవాలని అటవీ శాఖ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ను ఆదేశించినట్లు వెల్లడించారు. సంక్షేమ పథకాలపై జరిగిన చర్చలోనూ మంత్రి మాట్లాడుతూ.. ఈ ఏడాది ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు రూ.1,954 కోట్లు కేటాయించగా రూ.1,579 కోట్లు విడుదల చేశామని, నెలాఖరులోగా మొత్తం విడుదల చేస్తామన్నారు.

4 బీసీ స్టడీ సర్కిళ్లకు భవనాలు నిర్మిస్తున్నామని తెలి పారు. మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. దళితు లకు ఈ ఏడాది 10 వేల ఎకరాలు భూమి పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. మంత్రి ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మహిళాశిశు సంక్షేమ శాఖ పరిధిలోని అంగన్‌వాడీలు, స్టేట్‌హోంలకు సన్న బియ్యం సరఫరా చేస్తామని ప్రకటించారు. కాగా,ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళలకు 2016–17 బడ్జెట్‌ నిధుల్లో 70 శాతమే ఖర్చు చేశారని మండలిలో కా>ంగ్రెస్‌పక్ష నేత షబ్బీర్‌అలీ విమర్శించారు. గిరిజన సంక్షేమానికి రూ. 2,273 కోట్లు కేటాయించి రూ.935 కోట్లే విడుదల చేశారని దుయ్యబట్టారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ స్థానంలో ప్రత్యేక అభివృద్ధి నిధి తీసుకురావడం మంచిదేనని చెప్పారు.

భూపాలపల్లి కలెక్టర్‌పై చర్యలు తీసుకోవాలి
వన్యప్రాణులను చంపి తినమనడం నేరం: రాంచంద్రరావు
సాక్షి, హైదరాబాద్‌: ఒకవైపు బ్రాహ్మణ కులాల్లోని పేదల సంక్షేమానికి ప్రత్యేక కార్పొరేషన్‌ ద్వారా ప్రభుత్వం కృషి చేస్తుండగా, మరోవైపు భూపాలపల్లి కలెక్టర్‌ బ్రాహ్మణ సమాజాన్ని అగౌరవపరుస్తూ మాట్లాడటం బాధాకరమని బీజేపీ ఎమ్మెల్సీ రాంచంద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు. అడవి పందులను చంపి తినండంటూ.. వన్యప్రాణుల చట్టాన్ని ఉల్లంఘించిన కలెక్టర్‌ మురళిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

శనివారం శాసన మండలిలో బలహీన వర్గాల సంక్షేమంపై జరిగిన చర్చలో రాంచంద్రరావు మాట్లాడుతూ.. షాదీ ముబారక్‌ పథకాన్ని వినియోగించుకునేందుకు లబ్ధిదారులు ముందుకు రావడంలేదని, ఫలి™ èlంగా ప్రభుత్వం కేటాయించిన నిధులు నిరుపయోగం అవుతున్నాయన్నారు. శాశ్వత ప్రాతిపదికన కాకుండా తక్కువ వేతనాలతో కాంట్రాక్ట్‌ టీచర్లను నియమిం చ డంతో గురుకులాల్లో నాణ్యమైన విద్య ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. ఉస్మా నియా వర్సిటీ హాస్టళ్లలో విద్యార్థులకు సరైన మౌలికవసతులను కల్పించడం లేదన్నారు.
అడవి పంది, గొడ్డు మాంసం తినండి

మరిన్ని వార్తలు