బీసీల అభివృద్ధికి సీఎం కృషి

16 Jul, 2018 12:19 IST|Sakshi
కార్యక్రమంలో మాట్లాడుతున్న మంత్రి జోగు రామన్న

ఆదిలాబాద్‌రూరల్‌: బీసీల అభివృద్ధికోసం సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అ న్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని రెవెన్యూ గార్డెన్స్‌లో నిర్వహించిన వడ్డెర కులస్తుల మహాసభకు మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీల అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారన్నారు. చేతి వృత్తులపై ఆధారపడి జీవనం కొనసాగించే వారిలో వడ్డెర కులస్తులు మొదటిస్థానంలో ఉన్నారన్నారు. కులవృత్తుల వారు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం బడ్జెట్‌లో కో ట్లాది రూపాయల నిధులు కేటాయిస్తోందన్నా రు. జిల్లా కేంద్రంలో సంఘ భవన నిర్మాణం కోసం ఎకరం స్థలం కేటాయించి వారికి భవనం నిర్మించి ఇస్తామన్నారు.

త్వరలో అందజేయనున్న డబుల్‌ బేడ్‌ రూం ఇళ్లలో వందఇళ్లు వడ్డెర కుస్తులకు కేటా యిస్తామన్నారు. వడ్డెరులు ఎదుర్కొం టున్న సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వాటి పరి ష్కరం కోసం కృషి చేస్తానన్నారు. అంతకు ముం దు మంత్రిని శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాములు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రంగినేని మనీ ష, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, జోగు ఫౌండేషన్‌ చైర్మన్‌ జోగు ప్రేమేం దర్, వడ్డెర సంఘం రాష్ట్ర నాయకుడు సత్తిబాబు, నారాయణ స్వామి, అంజనేయులు, జిల్లా అధ్యక్షుడు గంగయ్య, వడ్డెర కులస్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు