జోగులాంబ జిల్లా ఏర్పాటు చేయాలి

15 Aug, 2016 02:11 IST|Sakshi
జోగులాంబ జిల్లా ఏర్పాటు చేయాలి

సాక్షి, హైదరాబాద్: గద్వాల కేంద్రంగా జోగులాంబ జిల్లాను ఏర్పాటు చేయాలని మహబూబ్‌నగర్ జిల్లా ప్రజాప్రతినిధులు ఆందోళనకు దిగారు. గద్వాల జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో కొందరు ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో ధర్నా చేశారు. కొత్త జిల్లాలకు ఏర్పాటు చేసిన సబ్ కమిటీ ఎదుట తమ అభిప్రాయాలను వెల్లడించారు. వరంగల్‌లో జనగామను కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రతిపాదించారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ఆదివారం మహబూబ్‌నగర్, వరంగల్, నల్లగొండ జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధుల నుంచి సబ్‌కమిటీ అభిప్రాయాలను స్వీకరించింది. నల్లగొండను మూడు జిల్లాలుగా విభజించడం పట్ల ఆ జిల్లా నేతలు అభ్యంతరం పెట్టనప్పటికీ, వరంగల్ జిల్లాలోని కొన్ని మండలాలను యాదాద్రి జిల్లాలో కలపవద్దని సూచించారు.
 
గద్వాలకు లేనిదేంటీ..  వనపర్తిలో ఉన్నదేంటి!
మహబూబ్‌నగర్ జిల్లాలో గద్వాల జిల్లా కేంద్రంగా జోగులాంబ జిల్లాను ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి డీకే అరుణ సబ్‌కమిటీకి విన్నవించారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే వనపర్తి జిల్లాను ప్రభుత్వం ప్రతిపాదించిందని, గద్వాలలో లేని ప్రత్యేకతలు వనపర్తిలో ఏమున్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం తనలక్కీ నంబరు కోసమని రాష్ట్రాన్ని 24 జిల్లాలుగా చేయడం సరికాదని, ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా మొత్తం 17 జిల్లాలు చేస్తే సరిపోతుందని కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అన్నారు.

తక్కువ దూరంలో ఉన్న నాగర్ కర్నూల్, వనపర్తిలను కొత్త జిల్లాలకు కేంద్రాలుగా ప్రతిపాదించడం సరికాదని ఎమ్మెల్యే వంశీచందర్‌రెడ్డి అన్నారు. కొత్త జిల్లాలు ప్రజలకు సౌలభ్యంగా ఉండాలని, రాజకీయ ప్రయోజనాల కోసం పొరపాట్లు చేస్తే ప్రజలు క్షమించరని అలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ చెప్పారు. మరోవైపు జనగామను జిల్లా చేయాలని మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య కోరారు. ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, ఎర్రబెల్లి, ఎమ్మెల్సీలు బోడకుంటి వెంకటేశ్వర్లు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
 
అఖిలపక్ష సమావేశం వాయిదా
జిల్లాల పునర్విభజన ప్రక్రియలో భాగంగా మంగళవారం జరగాల్సిన అఖిలపక్ష సమావేశాన్ని ప్రభుత్వం వాయిదా వేసింది. సోమవారం అన్ని పార్టీల నేతలు స్వాతంత్య్ర దినోత్సవాల్లో పాల్గొనేందుకు తమ నియోజకవర్గాలకు వెళ్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సబ్‌కమిటీతో 17న జరగాల్సిన జిల్లా కలెక్టర్ల భేటీ యథావిధిగా నిర్వహించనున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నిలబెట్టుకోలేక నిందలా!

‘ఎన్‌కౌంటర్లపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాల్సిందే ’

బీజేపీలో నాకు తలుపులు మూసుకుపోలేదు..

నాగార్జున ఇంటి వద్ద పోలీసు బందోబస్తు

ఈనాటి ముఖ్యాంశాలు

కేటీఆర్‌.. మీతో ఛాయ్‌ కా, ఇంకేమైనా ఉందా?

మున్సిపల్‌ ఎన్నికలకు ఎందుకంత హడావుడి?

గెలుపు ఓటముల్లో అతివలదే హవా..

లక్ష మందితో బహిరంగ సభ: ఎమ్మెల్యే

ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల అరెస్టు

రామయ్యా.. ఊపిరి పీల్చుకో 

బాలిక కిడ్నాప్‌ కలకలం 

మాటలు కలిపాడు..మట్టుపెట్టాడు

కాంగ్రెస్‌ సభ్యుల నిరసన; కేసీఆర్‌ స‍్పందన

మనకూ ‘ముంబై’ ముప్పు

‘కాంగ్రెస్‌ అనాథగా మారిపోయింది’

పట్నంలో అడవి దోమ!

ఆత్మహత్య చేసుకున్న ఇద్దరు యువకులు

బైకుల దొంగ అరెస్ట్‌

కేఎంసీ వర్సెస్‌ ఎంజీఎం 

'మస్ట్‌'బిన్‌ లేకుంటే జరిమానాల దరువు

కొత్తపట్నం ఏర్పాటు ఇలా..

నీళ్లు ఫుల్‌

నగరంలోకి ఎలక్ర్టికల్‌ బస్సులు

వివాహేతర సంబంధం పెట్టుకుందని..

ద.మ.రై.. వంద రైళ్ల వేగం పెంపు..

అణచి వేసేందుకే మావోయిస్టు ముద్ర

చదువుతో పాటు.. ఉద్యోగం

మత మార్పిడి చేసిన మదర్సా నిర్వాహకుల అరెస్ట్‌

ఎట్టకేలకు ఒక్కటైన ప్రేమికులు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అడ్డంకులు మాయం!

కుశాలీ ఖుషీ

నిశ్శబ్దాన్ని విందాం

నేనంటే భయానికి భయం

సినిమాలో చేసినవి నిజంగా చేస్తామా?

వందమందితో డిష్యూం డిష్యూం