31వ వరకు అభ్యంతరాల స్వీకరణ

24 Jan, 2018 20:20 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న జాయింట్‌ కలెక్టర్‌ రవినాయక్‌

జాయింట్‌ కలెక్టర్‌ రవినాయక్‌

సాక్షి, యాదాద్రి : యాదాద్రి వైటీడీఏను ప్రత్యేక అభివృద్ధి ప్రాంతంగా తెలంగాణ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ చట్టం 1975 ప్రకారంగా గుర్తించిన 7 గ్రామాల్లో ఏవేని అభ్యంతరాలు, ఆక్షేపణలు మాస్టర్‌ప్లాన్‌కు వ్యతిరేకతలు ఉంటే ఈనెల 31వ తేదీ లోపు తెలియజేయాలని జాయింట్‌ కలెక్టర్‌ రవినాయక్‌ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో వైటీడీఏ అధికారులు, మాస్టర్‌ప్లాన్‌ పరి« దిలోని గ్రామాల సర్పంచ్‌లు, ఈఓపీఆర్డీలకు సమీక్ష నిర్వహించారు.

ఈసందర్భంగా జేసీ మాట్లాడుతూ ప్రజలు ఈనెల 31వ తేదీ వరకు ఫిర్యాదుల ఇవ్వవచ్చన్నారు. వీటిని జిల్లా యంత్రాంగం ద్వారా ప్రభుత్వానికి పంపి తగు చర్యతీసుకుం టామని తెలిపారు. అనంతరం వైటీడీఏ అభివృద్ధిపై ఏఏ గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి జరుగుతుందో టౌన్‌ప్లానింగ్‌ అధికారులు ప్రజంటేషన్‌ చేశారు. సమావేశంలో వైటీడీఏ సెక్రటరీ సాయిరాం, వైటీడీఏ చీఫ్‌ ప్లానింగ్‌ అధికారి ఆర్‌.హరిప్రసాద్, టౌన్‌ప్లాన్‌ అధికారి సుష్మిత, జిల్లా పంచాయతీ అధికారి భిక్షం పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు