‘జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌’ దొరికిపోయింది!

9 Jul, 2020 13:47 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌లోని జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ విద్యార్థుల తల్లిదండ్రులు విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో అధికారులు స్కూల్‌లో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో డీఈఓ తనిఖీలు నిర్వహిస్తుంటే స్కూల్‌ ముందు యాజమాన్యం నిఘా పెట్టింది. స్కూల్‌ గురించి మీడియా, తల్లిదండ్రులు ఏం మాట్లాడుతున్నారో తెలుసుకునేందుకు యాజమాన్యం కెమెరాలలో రికార్డ్‌ చేసుకుంటోంది.

స్కూల్‌ ఆవరణంలో ముగ్గురు మనుషులతో నిఘా పెట్టగా, వారిలో ఇద్దరు కెమెరాలతో రికార్డు చేస్తుంటే మరొకరు వాకీటాకీలతో అక్కడ జరుగుతున్న సమాచారాన్ని స్కూల్‌ యాజమాన్యానికి చేరవేస్తున్నారు. మీడియా స్కూల్‌ పేరెంట్స్‌తో మాట్లాడిస్తున్న సందర్భంలో వారి కెమెరాలతో రికార్డు చేస్తున్నారు. ఈ దృశ్యాలు చిత్రీకరిస్తున్న సమయంలో మీడియాకు అడ్డంగా దొరికిపోయారు. (జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో విద్యాశాఖ అధికారుల విచారణ)

మరిన్ని వార్తలు