ప్రమాదవశాత్తు కిందపడి జూనియర్ అసిస్టెంట్ మృతి

25 Jul, 2015 23:47 IST|Sakshi

షాబాద్ మండల కేంద్రంలో ఘటన
మృతుడు మహబూబ్‌నగర్ జిల్లావాసి

 
 షాబాద్: ఇంట్లో ప్రమాదవశాత్తు కిందపడిన ఓ జూనియర్ అసిస్టెంట్ తీవ్రంగా గాయపడి మృతిచెందాడు. ఈ సంఘటన షాబాద్ మండల కేంద్రంలో శనివారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ శ్రీధర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్ డివిజన్ బొంరాస్‌పేట్ మండలానికి చెందిన కుర్వ శంకరప్ప(40) మూడు సంవత్సరాలుగా షాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇక్కడే అద్దె ఇంట్లో ఉం టూ ఉద్యోగం చేస్తున్నాడు. ఎప్పటిలాగే శుక్రవారం 6 గంటల వరకు కార్యాలయంలో విధులు ముగించుకున్న ఆయన గదికి వెళ్లాడు. వంటగదిలో నుంచి బయటకు వ స్తుండగా ప్రమాదవశాత్తు కిందపడిపోయా డు. తల వెనుకభాగం గోడకు తగలడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. శనివారం ఉదయం 10 గంటలు దాటిన శంకరప్ప బయటకు రాకపోవడంతో ఇంటి యజమాని వెంకటయ్య తలుపుతట్టాడు.

లోపలి నుంచి గడియ ఉంది. ఎంతకూ స్పందన లేకపోవడంతో స్థానికులతో కలిసి తలుపులు విరగ్గొట్టి చూడగా అప్పటికే శంకరయ్య విగతజీవిగా కనిపించాడు. దీంతో ఆయన ఎంపీడీఓ పద్మావతితో పాటు కుటుంబీకులకు సమాచారం ఇచ్చాడు. ఎస్‌ఐ శ్రీధర్‌రెడ్డి, ఎంపీపీ పట్నంశెట్టి జ్యోతి, ఎంపీడీఓ పద్మావతి ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడికి భార్య మంజుల, ఇద్దరు పెళ్లీడుకొచ్చిన కూతుళ్లు ఉన్నారు. శంకరప్ప కుటుంబీకులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎంపీపీ, ఎంపీడీఓలు హామీ ఇచ్చారు. ఇంటికి పెద్దదిక్కుగా ఉన్న శంకరప్ప మృతితో కుటుంబీకులు కన్నీటిపర్యంతమయ్యారు. చేవెళ్ల ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని బంధువులకు అ ప్పగించినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీధర్‌రెడ్డి పేర్కొన్నారు.
 
 

మరిన్ని వార్తలు