‘జూనియర్స్‌’ రాజీనామా   

6 Aug, 2019 12:17 IST|Sakshi
ఫకీర్‌పేట గ్రామ పంచాయతీ కార్యాలయం

మూణ్నాళ్ల ముచ్చటగా జూనియర్‌ పంచాయతీ కార్యదర్శి కొలువు

ఒత్తిళ్లతో యువ ఉద్యోగుల ఆందోళన

జిల్లాలో 12 మంది రాజీనామా

సాక్షి, కరీంనగర్‌: నిరుద్యోగ యువతకు జూనియర్‌ పంచాయతీ కార్యదర్శి కొలువు దొరికిన సంబరం లేకుండా పోతోంది. బాధ్యతల బరువు, ఒత్తిడి తట్టుకోలేక రాజీనామాకు సిద్ధం అవుతున్నారు. ఓ వైపు ప్రభుత్వం గతంలో కార్యదర్శులకు ఉన్న చెక్‌పవర్‌ తొలగించడంతోపాటు అదనంగా హరితహారం, పారిశుధ్య నిర్వహణ, ఓడీఎఫ్, ప్రభుత్వ పథకాల అమలు బాధ్యతలు అప్పగించింది. మరో వైపు సర్పంచులు, అధికార పార్టీ నాయకులు తమ పనుల కోసం ఒత్తిళ్లు తేవడమే కాకుండా దాడులకు పాల్పడుతున్నారు. రెండువైపుల నుంచి ఒత్తిళ్లు భరించలేక కొందరు కార్యదర్శులు కొత్త ఉద్యోగాల్లో చేరగా.. మరికొందరు రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారు. గతనెల 23న కరీంనగర్‌ మండలం ఇరుకుల్ల గ్రామ పంచాయతీ కార్యదర్శి పద్మపై సర్పంచు భర్త బలుసుల శంకరయ్య దౌర్జన్యం చేయడం జిల్లాలో వివాదాస్పదంగా మారింది. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇంతవరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంపై కార్యదర్శులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం పనిచేసే అవకాశం లేకుండా పోతుందంటూ పలువురు కార్యదర్శులు  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

12మంది రాజీనామా..
కరీంనగర్‌ జిల్లాలో మొత్తం 313 గ్రామ పంచాయతీలుండగా ప్రభుత్వం ఏప్రిల్‌ 12న మొత్తం 205మంది జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులను కేటాయించింది. వీరిలో 197మంది మాత్రమే ఉద్యోగాల్లో చేరగా మిగతా 8మంది వివిధ కారణాలతో బాధ్యతలు చేపట్టలేదు. జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల్లో కొందరు రాజకీయ ఒత్తిళ్లు తట్టుకోలేక ఉద్యోగాన్ని వదులుకుంటున్నారు. కార్యదర్శులకు ఎలాంటి శిక్షణ ఇవ్వకుండానే ప్రభుత్వం నియమించడంతో క్షేత్రస్థాయిలో పలు సమస్యలు ఏర్పడుతున్నాయి. విధినిర్వహణపై అవగాహన లేకపోవడంతోపాటు కొత్తపంచాయతీరాజ్‌ చట్టంతో బాధ్యతలు పెరగడం, పనిభారంతో ఆందోళనకు గురవుతున్నారు. మూడేళ్ల వరకు ఉద్యోగ భద్రత లేకపోవడంతో మంచి ఉద్యోగాలు రావడంతో కార్యదర్శి ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నారు. ఇప్పటివరకు ప్రభుత్వం కార్యదర్శులకు జీతాలు సైతం చెల్లించలేదు. ఇటీవల ప్రకటించిన ఎస్సై, ఫారెస్ట్‌బీట్‌ ఆఫీసరు ఉద్యోగాలకు పలువురు కార్యదర్శులు ఎంపికయ్యారు. దీంతో వెంటనే కార్యదర్శి పోస్టులకు రాజీనామా చేసి ఆయా ఉద్యోగాల్లో  చేరిపోయారు. ప్రస్తుతం జిల్లాలో 12మంది జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు తమ పదవులకు రాజీనామా చేశారు. త్వరలో ప్రకటించే గ్రూప్‌–2, కానిస్టేబుల్‌ ఉద్యోగాల ఫలితాలను దృష్టిలో పెట్టుకుని మరికొందరు కార్యదర్శులు సైతం రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కుక్కేశారు..

అక్రమ రిజిస్ట్రేషన్లకు అడ్డాగా 'ఆ' సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీస్‌

పోలీసుల అదుపులో మావోయిస్టు గోపి..? 

వేలిముద్ర వేస్తేనే.. సన్న బియ్యం

పారని పాచిక..

‘తీన్మార్‌ మల్లన్నకు రక్షణ కల్పించాలి’

ముహూర్తం నేడే..  

సైకిల్‌ యాత్రకు మనోళ్లు

నగరంలో హై అలర్ట్‌

‘టిక్‌ టాక్‌’తో హద్దు మీరొద్దోయ్‌  

ఆ రూటూ.. ఈ రూటూ.. కుదిపేట్టు!

ఉక్కిరిబిక్కిరవుతున్న కొత్త సర్పంచ్‌లు

పైసా ఉంటే ఏ పనైనా..

తెలంగాణ అప్రమత్తం! 

ఏ ప్రాతిపదికన కేబినెట్‌ నిర్ణయించింది? 

పాలమూరు ప్రాజెక్టుకు రూ.10 వేల కోట్ల రుణం 

ఇసుక ధరలకు రెక్కలు 

మూడో కౌన్సెలింగ్‌కు బ్రేక్‌ 

టార్గెట్‌ జాబ్‌..

నదుల ఉగ్ర తాండవం  

వైద్య విధాన పరిషత్‌ డాక్టర్లకు షాక్‌ 

టీ సర్కార్‌ ప్రజల వ్యక్తిగత డాటాను చోరీ చేస్తోంది

ఈనాటి ముఖ్యాంశాలు

బీజేపీది ఏకపక్ష ధోరణి

హైదరాబాద్‌ ప్రశాంతంగా ఉంది: అంజనీ కుమార్‌

దేశానికే ఆదర్శం కావాలి- హరీష్‌రావు 

టీఆర్‌ఎస్‌ నేతలకు చెంప చెళ్లుమంది: బీజేపీ ఎంపీ

సభలు, ర్యాలీలకు అనుమతి లేదు

గుండాల ఎన్‌కౌంటర్ : విచారణ వాయిదా

కొంగరకలాన్‌లో దర్జాగా కబ్జా! 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘సాహో’కి సైడ్‌ ఇచ్చినందుకు థ్యాంక్స్‌

‘లాయర్‌ సాబ్‌’గా బాలయ్య!

వాల్మీకి సెట్‌లో ఆస్కార్‌ విన్నర్‌!

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తరువాత ఆ డైరెక్టర్‌తో!

చట్రంలో చిక్కిపోతున్నారు!

షూటింగ్‌ సమయంలో కలుసుకునే వాళ్ళం..