సామాజిక న్యాయ జేఏసీ చైర్మన్‌గా జస్టిస్‌ చంద్రకుమార్‌

17 Mar, 2017 01:54 IST|Sakshi
సామాజిక న్యాయ జేఏసీ చైర్మన్‌గా జస్టిస్‌ చంద్రకుమార్‌

హైదరాబాద్‌: సామాజిక న్యాయ ఐక్య కార్యాచరణ కమిటీ సారధిని ఎన్నుకు న్నారు. చైర్మన్‌గా జస్టిస్‌ బి.చంద్రకుమార్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యా రు. గురువారం హైదరాబాద్‌లోని సుందర య్య విజ్ఞాన కేంద్రంలో సామాజిక న్యాయ ఐక్య కార్యాచరణ కమిటీ ఏర్పాటు సమా వేశం జరిగింది. ఈ సందర్భంగా కొత్త కమిటీని ఎన్నికున్నారు. కో–చైర్మన్‌గా ప్రొఫెసర్‌ పీఎల్‌ విశ్వేశ్వర్‌ రావు, కన్వీనర్లుగా సోయం బాబూ రావు, భారత్‌ వాగ్మా రే, ప్రొఫెసర్‌ తిరుమలి, మురళీ మనోహర్, మన్నారం నాగరాజు, ఎంఎ.ము జీబ్, సొగరా బేగం, కార్యదర్శులుగా ఎన్‌ శ్రీనివాస్‌యాదవ్, టి. విష్ణు, బిక్షపతిలను ఎన్ను కున్నారు.

 అనంతరం జస్టిస్‌ చంద్ర కుమార్‌ మాట్లాడుతూ.. సామా జిక న్యాయం, ప్రజాస్వా మ్య స్థాపనే లక్ష్యంగా ఐక్య కార్యా చరణ కమిటీ ఏర్పడిందన్నారు. తెలంగాణ వస్తే ఆత్మగౌరవం దక్కుతుందని భావించా మని, కాని ఇప్పటికీ అదే వివక్ష కొనసా గుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అనేక త్యాగాలతోనే రాష్ట్రం ఏర్పడిందని, కాని లబ్ధి పొందుతున్నది మాత్రం ఒక్క టీఆర్‌ఎస్‌ పార్టీయేనని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు న్యాయం జరిగేలా పోరాటం చేస్తామని వివరించారు.

మరిన్ని వార్తలు