ప్రియాంక తల్లిదండ్రుల గుండెకోత వర్ణణాతీతం

30 Nov, 2019 16:16 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రియాంకరెడ్డి ఘటన చాలా బాధాకరమని, వారి ఇంట్లో జరిగిన అన్యాయం ఇంకెవరి ఇంట్లో జరగకూడదని సినీనటుడు అలీ అన్నారు. శనివారం ప్రియాంకరెడ్డి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రియాంక తల్లిదండ్రులతో నేను మాట్లాడినప్పుడు వారు ఒకటే డిమాండ్ చేశారు. తమ కూతురు ఎలాంటి పరిస్థితుల్లో మృతి చెందిందో అలాగే నిందితులను కూడా అలాగే తగలబెట్టాలి అని కోరారు. ప్రియాంక తల్లిదండ్రుల కడుపుకోత వర్ణణాతీతంగా ఉంది. నా కూతురు కూడా డాక్టర్ చదువుతోంది. డాక్టర్ అయిన కూతురు చనిపోతే ఆ కుటుంబం ఎంత బాధ పడుతుందో అర్థం చేసుకోవాలి. భవిష్యత్‌లో ఇలాంటి దారుణ ఘటనలు పునరావృతం కాకుండా నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నాన’ని అలీ అన్నారు.

పోలీసులూ.. మారండి: భట్టి
ప్రియాంకరెడ్డి హత్య సభ్య సమాజం తలదించుకునే దాడి అని, మృగాల్లాగే అమ్మాయిపై దాడి చేశారని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క అన్నారు. మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి ప్రియాంక కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. ప్రియాంక ఆత్మకు శాంతి కలగాలని, నిందితులని కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా విక్రమార్క డిమాండ్‌ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిందితులకు శిక్ష విధించాలని అభిప్రాయపడ్డారు. పోలీసులు కూడా ఎవరికైనా ఆపద వస్తే తక్షణమే స్పందించాలని సూచించారు. వారి స్టేషన్‌ పరిధిలోకి వచ్చినా రానున్న కూడా బాధితులకు అండగా నిలవాలని కోరారు. ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి తాము సహకరిస్తామన్నారు.

కొంతమందితోనే ఫ్రెండ్లీగా పోలీసులు: శ్రీధర్‌బాబు
ప్రియాంక హత్య ఘటనపై సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కూడా దిగ్బ్రాంది చెందారని మాజీ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. సోనియ గాంధీ తమతో మాట్లాడి వివరాలు అడిగారని వెల్లడించారు. పోలీసులు కొంతమందితోనే  ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటున్నారని ఆరోపిం​చారు. ఈ ఘటనలో పోలీసులు వైఫల్యం చెందినట్లు కుటుంబ సభ్యులు చెపుతున్నారని అన్నారు. నిందితులపై కట్టిన చర్యలు తీసుకోవాలని రాజకీయాలకు అతీతంగా తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు.

సంబంధిత వార్తలు

‘బహిరంగంగా కాల్చి చంపండి’

షాద్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత

28 నిమిషాల్లోనే చంపేశారు!

పోలీసుల నిర్లక్ష్యమే కొంపముంచిందా?

పశువులు తిరుగుతున్నాయి జాగ్రత్త

ప్రియాంక కేసులో ఇదే కీలకం

నా కొడుకుకు ఉరిశిక్ష వేసినా ఫర్వాలేదు

>
మరిన్ని వార్తలు