అసెంబ్లీ నుంచి జానారెడ్డి వాకౌట్

20 Mar, 2015 11:46 IST|Sakshi
అసెంబ్లీ నుంచి జానారెడ్డి వాకౌట్

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ నుంచి ప్రతిపక్షనేత కె.జానారెడ్డి శుక్రవారం వాకౌట్ చేశారు. అసెంబ్లీ ప్రారంభమైన వెంటనే ప్రతిపక్ష నేత జానారెడ్డి రాష్ట్రంలోని నిరుద్యోగల సమస్యను లేవనెత్తారు. దీనిపై సమాధానం చెప్పాలని ఆయన ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ను కోరారు. అందుకు ఆయన సమాధానంపై జానారెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈటెల సమాధానంతో తాము సంతృప్తి చెందలేదని తెలుపుతూ జానారెడ్డి సభ నుంచి వాకౌట్ చేశారు.

రెండేళ్లలో లక్ష ఉద్యోగాలకు నోటిపికేషన్లు ఇచ్చేందుకు తమ ప్రభుత్వ చర్యలు చేపట్టనుందని ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటించారు.  అయితే వెంటనే ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలని ఇప్పటికే రాష్ట్రంలోని నిరుద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఆ క్రమంలో గురువారం ఉస్మానియా యూనివర్శిటీలో నిరుద్యోగుల ఐకాస ర్యాలీ నిర్వహించి.. అసెంబ్లీ ముట్టడికి యత్నించింది. వారి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దాంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే.

>
మరిన్ని వార్తలు