60 శాతం ఉత్తీర్ణత సాధించాల్సిందే

12 Dec, 2016 15:05 IST|Sakshi
బుధవారం ప్రిన్సిపాల్స్ వర్క్‌షాప్‌లో జ్వోతి ప్రజ్వలన చేస్తున్న కడియం శ్రీహరి

ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఫలితాలపై కడియం శ్రీహరి
బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించకపోతే చర్యలు
ప్రిన్సిపాళ్ల వర్క్‌షాప్‌లో డిప్యూటీ సీఎం హెచ్చరిక

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ జూనియర్ కాలేజీ వచ్చే వార్షిక పరీక్షల్లో కనీసం 60 శాతం ఉత్తీర్ణతను సాధించాల్సిం దేనని, ఇప్పటికే 60 శాతం ఉత్తీర్ణత ఉన్న కాలేజీలు కనీసం పది శాతం అదనంగా ఉత్తీర్ణతను సాధించాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఇందుకోసం ప్రినిపాళ్లు, లెక్చరర్లు ప్రత్యేక కార్యాచరణను అమలు చేయాలన్నారు. డిసెంబర్ నెలాఖరు కల్లా సిలబస్ మొత్తం పూర్తి చేసి, ఆ తరువాత రివిజన్, స్టడీ అవర్లు నిర్వహించి ఫలితాలను పెంచాలన్నారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల ప్రిన్సిపాళ్లకు బుధవారం ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో నిర్వహించిన వర్క్‌షాప్‌ను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల ప్రిన్సిపాళ్ల బాధ్యతలు, విధుల మాన్యువల్‌ను ఆవిష్కరించారు. అనంతరం కడియం మాట్లా డుతూ, జూనియర్ కాలేజీలకు ప్రభుత్వం సరి పడా నిధులు ఇస్తోందని, మౌలిక సదుపాయా ల కల్పనకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వాటితోపాటు నాణ్యమైన విద్యను అందిం చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాష్ట్రంలోని 404 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 2,80,000 సీట్లు ఉన్నాయని, వచ్చే ఏడాది కనీసం 2 లక్షల మంది విద్యార్థులు చేరేలా ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లు కృషి చేయాలని సూచించారు.

 విద్యావ్యవస్థ కీలకం: మానవ వనరులు అభివృద్ధి చెందలేదన్న అపవాదు తెలంగాణపై ఉందని, అది సీఎం కేసీఆర్‌కు ఇష్టంలేదని కడియం అన్నారు. మానవ వనరుల అభివృద్ధిలో విద్యా వ్యవస్థ కీలకమైందని సీఎం కేసీఆర్ గుర్తించి, అనేక విద్యా కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. అవి సత్ఫలితాలు ఇచ్చేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ప్రభుత్వ కాలేజీలను పటిష్టం చేసేందుకు పక్కా భవనాలు నిర్మిస్తున్నామని, కనీస వసతులు, కంప్యూటర్లు, లైబ్రరీలు, బయోమెట్రిక్ మిషన్లకు నిధులు ఇస్తున్నామని తెలిపారు. ఫలితంగా గత ఏడాది 40 వేల మంది విద్యార్థులు అధికంగా ప్రభుత్వ కాలేజీల్లో చేరారన్నారు.

కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుందన్నారు. అరుుతే న్యాయ పర ఇబ్బందుల వల్ల ఆలస్యం అవుతోం దన్నారు. ఈ ప్రక్రియ పూర్తి కాగానే మిగిలిన ఖాళీలను కూడా భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కాలేజీల్లో అడిగిన వసతులన్నీ కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అదే సమయంలో పనిచేయకపోతే చర్యలు తప్పవని అన్నారు. ఈ సమావేశంలో విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్వి రంజీవ్ ఆర్ ఆచార్య, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ తదితరులు పాల్గొన్నారు.

ముందే నిధులు విడుదల చేయండి..
కాలేజీల నిర్వహణకు ఇచ్చే నిధులను కాలేజీల ప్రారంభానికి ముందే విడుదల చేయాలని ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్‌ను కడియం ఆదేశించారు. వీలైనంత వరకు ప్రిన్సిపాళ్లు కాలేజీలున్న చోటే నివాసం ఉండాలన్నారు. మహబూబ్‌నగర్ ప్రభుత్వ బాలికల కాలేజీలో 2,500 మంది విద్యార్థినులు ఉన్నారని, వీరికి కావాల్సిన టారుులెట్స్, ఇతర అవసరాల కోసం కలెక్టర్‌ను సంప్రదిస్తే అవపసరమైన ఏర్పాట్లు చేస్తారని చెప్పారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా