కాగజ్‌నగర్‌ ఎఫ్‌ఆర్వోకు గోల్డ్‌మెడల్‌ 

15 Aug, 2019 09:50 IST|Sakshi

సాక్షి, కాగజ్‌నగర్‌ : మురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ ఫారెస్ట్‌ రేంజి అధికారి ఛోలె అనిత కేవీఎస్‌ బాబు మెమోరియల్‌ గోల్డ్‌మెడల్‌ అవార్డుకు ఎంపికైనట్లు కాగజ్‌నగర్‌ ఎఫ్‌డీఓ రాజరమణారెడ్డి తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఫారెస్ట్‌ ప్రిన్సిపాల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆర్‌.శోభ పంపించిన ఉత్తర్వుల ప్రకారం స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని దూలపల్లి అటవీ శిక్షణ అకాడమీ ప్రాంగణంలో ఈ అవార్డు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. అవార్డుతో పాటు రూ.15వేల నగదు, ప్రశంసపత్రం అందిస్తారన్నారు. 2018 జూన్‌ 30 నుంచి ఈ ఏడాది జూన్‌ 30 వరకు కాగజ్‌నగర్‌ రేంజిలో అనేక సవాళ్లను ఎదుర్కొందన్నారు. చింతగూడలో అక్రమ కలప వ్యాపారాన్ని అరికట్టడంలో ఆమె ధైర్య సాహసాలు ప్రదర్శించిందని, గార్లపేట రిజర్వు ఫారెస్ట్‌లో 2013 నుంచి పోడు భూమిలో వ్యవసాయం చేసుకుం టున్న 16 మంది గిరిజ న గోండు గ్రామస్తులను తొలగించడంలో ప్రము ఖ పాత్ర పోషించిందన్నారు. ఆమె ధైర్య సాహసాలను పరిగణలోకి తీసుకొని ఫారెస్ట్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు చేసిన సిఫార్సులను దృష్టిలో పెట్టుకొని ఉన్నతాధికారులు ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు చెప్పారు.    

మరిన్ని వార్తలు