మహేందర్‌రెడ్డి, సబితారెడ్డిలను కలిసిన ఎమ్మెల్యే

11 Jun, 2019 15:04 IST|Sakshi
ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డితో ఎమ్మెల్యే కాలె యాదయ్య కుటుంబ సభ్యులు

 
చేవెళ్ల: చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కుటుంబ సభ్యులతో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, మాజీ హోంశాఖ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితారెడ్డిలను సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఎమ్మెల్యే భార్య జయమ్మ నవాబుపేట జెడ్పీటీసీగా, కోడలు భవాని నవాబుపేట ఎంపీపీగా, కొడుకు శ్రీకాంత్‌ మొయినాబాద్‌ జెడ్పీటీసీగా గెలుపొందడంతో వారిని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను శాలువాలతో సన్మానించారు.   

ఎంపీ రంజిత్‌రెడ్డిని కలిసిన చేవెళ్ల జెడ్పీటీసీ..  

నూతనంగా టీఆర్‌ఎస్‌ జెడ్పీటీసీగా గెలిచిన మర్పల్లి మాలతీ క్రిష్ణారెడ్డి చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డిని  కలిశారు. సోమవారం నగరంలోని ఆయన నివాసానికి ఎమ్మెల్యే కాలె యాదయ్య సమక్షంలో వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా వారు ఎంపీకి  పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం ఎంపీ జెడ్పీటీసీని శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు క్రిష్ణారెడ్డి, వెంకట్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.  
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు