కాళేశ్వరం అద్భుతం

12 Feb, 2018 17:26 IST|Sakshi
గోలివాడ పంపుహౌస్‌ను పరిశీలిస్తున్న ప్రొఫెసర్లు

ప్రాజెక్టులు సందర్శించిన ప్రొఫెసర్లు

రామగుండం/మంథని: నీళ్ల లొల్లి తెలంగాణ రాష్ట్ర సాధనకు దారితీసిందని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌ గంటా చక్రపాణి అన్నారు. మంథని మండలం సిరిపురం వద్ద నిర్మిస్తున్న అన్నారం పంపుహౌస్, సుందిళ్ల బ్యారేజీ, అంతర్గాం మండలం గోలివాడ(సుందిళ్ల) పంపుహౌస్‌ నిర్మాణ పనులను ఆదివారం పరిశీలించారు. కాళేశ్వరం ప్రా జెక్టుకు ప్రపంచ గుర్తింపు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ మల్లేశం మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు ఓ అద్భుత మని, రివర్స్‌ పంపింగ్‌ ద్వారా 50 మీటర్ల లోతున్న నీటిని సాగు, తాగునీటి అవసరాలను తీర్చేలా ఉం దన్నారు.

సోషియాలజీ ప్రొఫెసర్‌ రాఘవరెడ్డి మాట్లాడుతూ ఉద్యమ స్ఫూర్తితో అతి తక్కువ కాలంలోనే ప్రాజెక్టుల పనులు సాగుతుండడం అద్భుతమన్నారు. ఐఐటీ ఇంజినీర్‌ దొంగరి నిశాంత్‌ మాట్లాడుతూ రివర్స్‌లో నీటిని తీసుకెళ్లడమే అద్భుతమన్నారు. భూసేకరణ లేకుండానే లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించాలనే ఆలోచన బాగుందన్నారు. ప్రొఫెసర్‌లు లింబాద్రి, సాయిలు మాట్లాడుతూ గోదావరిలో 140 కిలోమీటర్ల పొడవునా ఎల్లకాలం నీళ్లు ఉండేలా చూడడం ద్వారా ఎన్నో ఎకరా లు సాగులోకి వస్తాయన్నారు.  

ఉస్మానియా యూనివర్సిటీ ఫ్యాకల్టీ డీన్‌ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ అవసరాల మేరకు అన్ని సమయాల్లో సమృద్ధిగా నీటి నిల్వలుండడం దీని ప్రత్యేకత అని కొనియాడారు.  ప్రొఫెసర్‌ చెన్న బసవయ్య మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ సంకల్పంతోనే ఈ ప్రాజెక్టు పురుడుపోసుకుందని కొనియాడారు.  కాకతీయ యూనివర్సిటీ సోషల్‌ వర్కర్‌ ప్రొఫెసర్‌ శ్రీనివాస్, ఎన్విరాన్‌మెంటల్‌ డాక్టర్‌ సి.శ్రీనివాస్, సీనియర్‌ జర్నలిస్టులు శ్రీనివాస్‌రెడ్డి, నరేందర్‌ పాల్గొన్నారు. వీరికి ఇరిగేషన్‌ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ బండ విష్ణుప్రసాద్, డీఈ నరేశ్, సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.     

మరిన్ని వార్తలు