‘కాళేశ్వరంతో భూములన్నీ సస్యశ్యామలం’

1 Apr, 2019 13:13 IST|Sakshi
ధర్పల్లి ఎన్నికల సభలో మాట్లాడుతున్న టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి కవిత

కాంగ్రెస్‌ పార్టీ  మునిగిపోయే పడవ

నిజామాబాద్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కవిత 

ధర్పల్లి: రాష్ట్రంలోని కాళేశ్వరం నీటితో భూములన్నీ సస్యశ్యామం చేస్తామని టీఆర్‌ఎస్‌ పార్లమెంట్‌ అభ్యర్థి కల్వకుంట్ల కవిత అన్నారు. ధర్పల్లి మండలకేంద్రంలోని టీఆర్‌ఎస్‌ పార్లమెంట్‌ అభ్యర్థి కల్వకుంట్ల కవిత ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గంలోని రామడుగు ప్రాజెక్ట్‌ కింద 21 ప్యాకేజీ కింద 365 రోజులు ప్రాజెక్ట్‌ నిండుగా ఉండేందుకు మంచిప్పా రిజర్వాయర్‌ ద్వారా సాగునీటిని అందిస్తామన్నారు. ప్రతి మూడెకరాలకు పైప్‌లైన్‌ ద్వారా సాగునీరు అందుతుందన్నారు. రూరల్‌ నియోజకవర్గంలోని ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తామన్నారు. ఈ ప్రాంతంలోని రైతులు పండిస్తున్న ఎర్రజొన్న రైతులను ఆదుకొని పంటలకు బోనస్‌ అందిస్తామన్నారు.

పసుపు బోర్డు అమలు చేస్తామన్నారు. కాంగ్రెస్‌ పార్టీ మునిగిపోయే నావా అన్నారు. ఇళ్లు లేన పేదలందరికి ఇంటి స్థలం ఉంటే రూ.5 లక్షలు చెల్లించి సొంత ఇంటి కల సాకారం చేస్తామన్నారు. కులవృత్తులందరికి సంక్షేమ ఫలాల కింద 100 శాతం రుణ సౌకర్యం కల్పిస్తామన్నారు. ఎర్రజొన్న రైతులను ఆదుకునేందుకు పంటలపై బోనస్‌ అందిస్తామన్నారు. పసుపు బోర్డు వచ్చేలా పోరాటం చేస్తామన్నారు. గత ఎమ్మెల్యే ఎన్నికల్లో తెలంగాణ ఆడపడుచుల ఆదరణతోనే టీఆర్‌ఎస్‌కు అఖండా మెజార్టీ వచ్చి సీఎం కేసీఆర్‌ రెండో సారి సీఎం పదవి దక్కిందన్నారు. కేంద్రంలోని 16 ఎంపీ స్థానాలను టీఆర్‌ఎస్‌ సొంతం చేసుకొని డిల్లీ రాజకీయాల్లో సీఎం కేసీఆర్‌ చక్రం తిప్పుతారన్నారు. కార్యక్రమంలో రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ వీజీగౌడ్, జెడ్పీ వైస్‌ చైర్మన్‌ గడ్డం సుమనరెడ్డి, జిల్లా టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, జిల్లా నాయకుడు ఆనంద్‌రెడ్డి, మండల అధ్యక్షుడు హన్మంత్‌రెడ్డి, మండల రైతు సమితి కో ఆర్డినేటర్‌ రాజ్‌పాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు