కరోనా నియంత్రణకు కఠిన చర్యలు

13 Apr, 2020 16:16 IST|Sakshi

కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ శరత్‌కుమార్‌

కరోనా నియంత్రణ చర్యలపై కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌

సాక్షి, కామారెడ్డి: కరోనా నియంత్రణకు కఠిన చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్‌ శరత్‌కుమార్‌ తెలిపారు. మాస్క్‌లను తప్పనిసరిగా ధరించాలని.. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడం నిషేధమన్నారు. ఆదేశాలను పాటించకపోతే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కరోనా వైరస్‌  నివారణ చర్యలపై ఆయన  జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. మహారాష్ట్రలో కరోనా  తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో అక్కడి నుంచి వచ్చే వాహనాలను అనుమతించవద్దని అధికారులను ఆదేశించారు.

మద్నూరు సరిహద్దులోని రోడ్లను మూసి వేయాలని తెలిపారు. మండల స్థాయి అధికారులు గ్రామస్థాయిలో పర్యవేక్షించాలని తెలిపారు. విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని క్వారంటైన్‌ కేంద్రాలకు తప్పనిసరిగా తరలించాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఇబ్బందులు తలెత్తకుండా వ్యవసాయ అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు