చోరీలే అతడి పని

13 Feb, 2018 15:04 IST|Sakshi
సమావేశంలో వివరాలు వెల్లడిస్తున్న కామారెడ్డి డీఎస్పీ ప్రసన్నరాణి

తాళం వేసిన ఇళ్లే టార్గెట్‌

నాలుగు కేసుల్లో నిందితుడి అరెస్టు

11.5 తులాల బంగారం, 13 తులాల వెండి, బైక్‌ స్వాధీనం

వివరాలు వెల్లడించిన డీఎస్పీ ప్రసన్నరాణి

కామారెడ్డి క్రైం: జల్సాల కోసం తేలికగా డబ్బు సంపా దించేందుకు చోరీలను ఎంచుకున్నాడు ఓ యువకుడు. ఎన్నిసార్లు జైలుకెళ్లినా అతడిలో మార్పు రాలేదు. బయటకు రాగానే తిరిగి చోరీలు చేస్తూనే ఉంటా డు. తాళం వేసిన ఇండ్లనే టార్గెట్‌ చేస్తూ అందినకాడికి దోచుకుంటాడు. ఇటీవల నాలుగు తాళం వేసిన ఇండ్లలో చోరీలు చేసినన కేసుల్లో నిందితుడైన నిజామాబాద్‌ జిల్లా మోపాల్‌ మండలం మంచిప్ప గ్రామానికి చెందిన గోత్రాల నాగరాజును రామారెడ్డి, సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని డీఎస్పీ ప్రసన్నరాణి తన కార్యాలయంలో విలేకరులకు వివరాలు వెల్లడించారు. నిందితుడిపై ఇప్పటికే 25 చోరీ కేసులు ఉన్నాయి.కామారెడ్డి, నిజామాబాద్, హైదరాబాద్‌తో పాటు చాలా ప్రాంతాల్లో ఈజీ మనీ కోసం నాగరాజు చోరీలు చేశాడు.

గతేడాది జూలైలో కామారెడ్డి పరిసరా ప్రాంతాల్లో చోరీలకు పాల్పడి అరెస్టు అయ్యాడు. నవంబర్‌ 17న జైలు నుంచి విడుదలైన అతడు మళ్లీ చోరీలు మొదలుపెట్టాడు. రామారెడ్డి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఉప్పల్‌వాయిలో రెండు, గిద్ద గ్రామంలో ఒకటి, ఇందల్‌వాయి మండలం గన్నారంలో ఒక తాళం వేసిన ఇంట్లో చోరీలు చేశాడు. ఆయా పోలీస్‌స్టేషన్ల పరిధిలో కేసులు నమోదయ్యాయి. సోమవారం ఉదయం చోరీ చేసిన సొత్తును కామారెడ్డిలో విక్రయించేందుకు బైక్‌పై వెళ్తుండగా రామారెడ్డి ఎస్‌ఐ కే.వినయ్‌కుమార్, సీసీఎస్‌ ఎస్‌ఐ పెంటయ్య ఆధ్వర్యంలో రామారెడ్డికి సమీపంలో వాహనాలు తనిఖీ చేసి పట్టుకున్నారు. అతడి నుంచి 11.5 తులాల బంగారం, 13 తులాల వెండి, ఒక సెల్‌ఫోన్, బైక్‌ను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. వాటి విలువ రూ.2లక్షల 53 వేలు ఉంటుందన్నారు. కేసులో కీలకంగా వ్యవహరించిన కామారెడ్డి రూరల్‌ సీఐ భిక్షపతి, సీసీఎస్‌ సీఐ రాజశేఖర్, రామారెడ్డి, సీసీఎస్‌ ఎస్‌ఐలు వినయ్‌కుమార్, పెంటయ్య, ఏఎస్‌ఐలు సంతోష్‌రెడ్డి, ఉస్మాన్, సంజీవరావు, పీసీలు శంకర్, రమేశ్, రాంచందర్, 
గణేష్, నరేష్‌ను ఆమె అభినందించారు.   

మరిన్ని వార్తలు