దోమకొండ కోట ఆస్తులపై కొట్లాట!

1 Nov, 2019 09:24 IST|Sakshi

సాక్షి, కామారెడ్డి: దోమకొండ కోట ఆస్తుల విషయంలో కామినేని వారసుల మధ్య తలెత్తిన ఆస్తి వివాదం చివరకు కోర్టుకు చేరింది. వారసుల్లో ఒకరైన సత్యనారాయణరావు కుటుంబం​ కోటలోని ఆస్తుల్లో తమ వాటా కోసం కామారెడ్డి కోర్టులో కేసు వేసింది. దీనిపై నోటీసులు అందుకున్న మిగతా వారసులందరూ గురువారం కోర్టుకు హాజరయ్యారు.

కామినేని వంశస్తులైన రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ఉమాపతి, అనిల్‌ కామినేని, సత్యనారాయణరావు, రోహిత్‌ రాజేశ్వర భూపాల్‌, లావణ్యతో పాటు మొత్తం 14మంది న్యాయస్తానం ఎదుట హాజరయ్యారు. కోటలోని వెంకటభవన్‌, అద్దాల బంగ్లా, అజ్గర్‌ మంజిల్‌, భరత్‌రాంభూపాల్‌ బంగ్లాతో పాటు స్థలాల విషయంలో వారసుల మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ కేసు విచారణ వచ్చే నెల 28కి వాయిదా పడినట్లు సమాచారం. 
చదవండివీధికెక్కిన ‘కామినేని’ ఆస్తుల తగాదా 

కోటలోని శివాలయంలో పూజలు చేస్తున్న ఉపాసన, రాంచరణ్‌ (ఫైల్‌ ఫోటో)

కాగా కామినేని అనిల్‌...అపోల్‌ ఆస్పత్రి చైర్మన్‌ ప్రతాప్‌ రెడ్డి కుమార్తె శోభనను వివాహం చేసుకున్నారు. అలాగే వారి కూతురు ఉపాసన హీరో రాంచరణ్‌ను వివాహమాడిన విషయం తెలిసిందే. ఉపాసన-రాంచరణ్‌ వివాహ వేడుకలు కూడా కోటలో జరిగాయి. వివాహం సందర్భంగా వారిద్దరూ కోటలోని శివాలయంలో పూజలు కూడా నిర్వహించారు. ఇక దోమకొండ కోటకు సంబంధించిన నలభై ఎకరాల ప్రహరీ గోడ ప్రస్తుతం పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది. మిగతా భవనాలు, భూములు కామినేని వంశస్తులవి. ప్రస్తుతం ఆస్తుల వారసత్వంపై కోర్టులో వివాదం కొనసాగుతోంది.


కోటలో చిరంజీవి, రాంచరణ్‌, ఉపాసన

మరిన్ని వార్తలు