భారత్‌ మాతాకీ జై కాదు..భీమ్‌..భూమ్‌ జై అనాలి

19 Apr, 2018 18:07 IST|Sakshi
మాట్లాడుతున్న కంచె ఐలయ్య

అంబేద్కర్‌ నిజమైన సైనికుడు

ప్రొఫెసర్‌ కంచె ఐలయ్య..

తెయూ(డిచ్‌పల్లి): భారత దేశ పౌరులంద రూ భారత్‌ మాతా కీ జై.. అనే నినా దాన్ని మానుకుని జై భీమ్‌.. జై భూమ్‌.. అనే నినాదాన్ని చేయాలని సామాజిక శాస్త్రవేత్త కంచె ఐలయ్య పిలుపునిచ్చారు. బుధవా రం డిచ్‌పల్లిలోని తెలంగాణ యూనివర్సి టీ క్యాంపస్‌లో  తెలంగాణ యూనివర్సిటీ  అంబేద్కర్‌ స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మహనీయుల జయంతి వేడుకలు’ కార్యక్రమానికి కంచె ఐలయ్య ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులు గోమాతను పూజించాలని చెబుతుంటారని, అయితే గోవు కంటే బర్రె (గేదె) పాలు ఎక్కువగా ఇస్తుందని, మరి బర్రెలను పూజించమని ఎందుకు చెప్పరని ప్రశ్నించారు.

గొల్ల కులంలో పుట్టిన అందరికీ వేపకాయంత వెర్రి ఉంటుందని, తనకు మాత్రం తాటికాయంత వెర్రి ఉందన్నారు. మంగళి కత్తి, చాకలి వృత్తి గొప్పవని, దేశంలో బ్రాహ్మణ రెజియేషన్‌ ఉందా అని ప్రశ్నించారు. భారత దేశానికి నిజమైన శత్రువు పాకిస్తాన్‌ కాదని, చైనా నుంచి దేశానికి ముప్పు పొంచి ఉందన్నారు. భవిష్యత్‌లో చైనాను ఎదుర్కొవాలంటే బెండకాయ, బీరకాయ తింటే సరిపోదని, మంచి బీఫ్‌ తినాలని పిలుపునిచ్చారు. రాందేవ్‌ బాబా యోగా ఉత్త గేమ్‌ అని, ప్రతి ఒక్కరూ ఎక్సర్‌సైజులు చేయాల ని సూచించారు. అలాగే ఇతరులతో పోటీ పడాలంటే ఇంగ్లీషు నేర్చుకోవడం తప్పనిసరి అని అన్నారు. 

చదువుల తల్లి సావిత్రిబాయి పూలే
గీతం యూనివర్సిటీ ప్రొఫెసర్‌ ప్రజ్ఞ మాట్లాడుతూ..  దేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలైన సావిత్రిబాయి ఫూలేను చదువుల తల్లిగా కొలువాలని పిలుపునిచ్చారు. సెప్టెంబర్‌ 5న సావిత్రి ఫూలే జయంతిని గురుపూజోత్సవం జరుపుకోవాలన్నారు. చిన్నారి ఆసిఫా అత్యాచారం, హత్య ఘటనలో రాజకీయ కుట్ర దాగి ఉం దని ఆరోపించారు. హైదరాబాద్‌ సెం ట్రల్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ బంగ్యా బుక్యా, ఎస్‌ఎస్‌డీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెంజర్ల నరేశ్, డాక ్టర్‌ మోతీలాల్, ఏఎస్‌ఏ తెయూ కన్వీనర్‌ జగన్, అధ్యక్షుడు అశోక్‌సామ్రాట్, రాజేందర్‌  పాల్గొన్నారు.    

మరిన్ని వార్తలు