‘ప్రణయ్‌ పేరుతో నిరభ్యంతర చట్టం’

18 Sep, 2019 11:14 IST|Sakshi
ప్రణయ్‌, అమృత (పాత ఫొటో)

సాక్షి, హైదరాబాద్‌: మహిళలపై వేధింపులు అరికట్టడానికి నిర్భయ చట్టం తెచ్చినట్లే కులాంతర ప్రేమ వివాహం చేసుకున్న వారి భద్రత కోసం నిరభ్యంతర చట్టాన్ని ప్రణయ్‌ పేరుతో తీసుకురావాలని కుల అసమానత నిర్మూలనా పోరాట సమితి(కేఎఎన్‌పీఎస్‌) వ్యవస్థాపక జాతీయ కన్వీనర్‌ బండారి లక్ష్మయ్య డిమాండ్‌ చేశారు. పెరుమాళ్ల ప్రణయ్‌ తొలి వర్థంతి కార్యక్రమం మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా కుల అహంకారం కారణంగా మరణించిన పలువురికి నివాళులర్పించారు.


సమావేశంలో మాట్లాడుతున్న లక్ష్మయ్య 

అనంతరం లక్ష్మయ్య మాట్లాడుతూ.. కులాంతర వివాహం చేసుకున్న వారిపై తరచూ దాడులు జరుగుతూనే ఉన్నాయని, వీటిని అరికట్టాలన్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో కులాంతర ప్రేమ వివాహాన్ని సహించలేని అమృత తండ్రి మారుతిరావు సుఫారీ ఇచ్చి ప్రణయ్‌ను హత్య చేయించాడని, ఈ దారుణ ఘటన జరిగి సెప్టెంబర్‌ 14 నాటికి ఏడాది గడిచిందని తెలిపారు. ప్రణయ్‌ వర్ధంతి సందర్భంగా పోరాట సమితిని ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. కార్యక్రమంలో వివిధ జిల్లాల నుంచి కొమ్ము సురేందర్, కందిక కోమల, పూజ, గుమ్మడి రత్నం, శివబి.యాదయ్య, చక్రవర్తి, దేవా, లక్ష్మయ్య, గోవింద్, లక్ష్మణ్, వినయ్‌ తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు