చపాతీ పిండిలో పురుగులు.. విద్యార్థినులకు అస్వస్థత

20 Sep, 2015 19:56 IST|Sakshi

పెద్ద అడిశర్లపల్లి(నల్లగొండ): కలుషిత ఆహారం తిన్న 30 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండల కేంద్రంలోని కస్తూర్భా ఆశ్రమ బాలికల పాఠశాలలో ఆదివారం జరిగింది. హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థినులకు ఈ రోజు ఉదయం టిఫిన్‌లో భాగంగా చపాతి అందించారు.

ఆ చపాతీలకోసం వినియోగించిన గోదుమ, మైదా పిండి, పప్పులో పురుగులు ఉండటంతో పాటు చపాతీలు సరిగా కాలక పోవడంతోనే విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారని తెలిసింది. విద్యార్థినుల పరిస్థితి విషమించడంతో వెంటనే వారిని 108ల సాయంతో దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 200 మంది విద్యార్థినిలు ఉన్న పాఠశాలాలో ఇప్పటికే జ్వరాలతో 35 మంది ఇళ్లకు చేరారు.

మరిన్ని వార్తలు