కేబీఆర్‌ పార్కు పాస్‌ల ధర పెంపు

21 Jun, 2019 09:50 IST|Sakshi

25 నుంచి పాస్‌ల రెన్యువల్‌

బంజారాహిల్స్‌: నగరంలోని కేబీఆర్‌ పార్కు వార్షిక పాస్‌ల రెన్యువల్‌ తేదీని ప్రకటించారు. ఈ నెల 25 నుంచి వచ్చే నెల 20వ తేదీ వరకు వాకర్లు తమ వార్షిక ప్రవేశ పాసులను పార్కు వెబ్‌సైట్‌లో రెన్యువల్‌ చేసుకోవాలని డీఎఫ్‌ఓ విజ్ఞప్తి చేశారు. కాగా.. 2019–20 సంవత్సరానికి వార్షిక పాస్‌లతో పాటు అన్ని కేటగిరీల పాసుల ధరలను పెంచారు. గతేడాది వార్షిక పాస్‌ రుసుం రూ.1,850 ఉండగా ఈసారి రూ.2,035కు పెంచారు. అలాగే సీనియర్‌ సిటిజన్ల పాస్‌ గతేడాది రూ.1,200 ఉండగా దాన్ని రూ.1,320కి పెంచారు. ఇక నెలవారీ పాసులను సైతం రూ.550 చేశారు. రోజువారీ ఎంట్రీ టికెట్‌ ధర రూ.25 నుంచి రూ.30కి, పిల్లలకు రూ.10 నుంచి రూ.15కు పెరిగాయి. 

మరిన్ని వార్తలు