సీఎం కేసీఆర్‌ మహిళా వ్యతిరేకి

31 Jul, 2018 15:13 IST|Sakshi
భిక్కనూరులో ర్యాలీలో పాల్గొన్న బీజేపీ నాయకులు, మహిళలు 

భిక్కనూరు నిజామాబాద్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ మహిళా వ్య తిరేకి అని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కాటిపల్లి వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. సోమవారం భిక్కనూరు మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యం లో మహిళా సంఘాల సభ్యులు ర్యాలీ నిర్వహించారు. మండల కేంద్రంలోని మార్కెట్‌ యార్డు నుంచి ఎంపీడీవో కార్యాలయం వరకు ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో మహిళలు పడరా ని పాట్లు పడుతున్నారన్నారు.

టీఆర్‌ఎస్‌ ప్రభు త్వం మహిళలను మోసం చేస్తోందని ఆరోపించా రు. రాష్ట్ర మంత్రివర్గంలో మహిళలకు చోటు క ల్పించకపోవడం సిగ్గుచేటన్నారు. మహిళా సం ఘాల సభ్యులు తీసుకున్న రుణాలపై గతంలో వడ్డీ రాయితీ ఇచ్చేవారని, ప్రస్తుత ప్రభుత్వం దానిని ఇవ్వడం లేదని ఆరోపించారు. మహిళలు బ్యాంకుల్లో వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నా రు.

భిక్కనూరు మండలంలోనే రూ. 9.50 కోట్ల వ డ్డీ రాయితీ రావాల్సి ఉందని, ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హె చ్చరించారు. మహిళా సంఘాలకు రావాల్సిన వడ్డీ రాయితీని విడుదల చేయాలని కోరుతూ ఈవోపీఆర్డీ అనంత్‌రావుకు వినతిపత్రాన్ని అందజేశారు.

కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు జిల్లెల రవీందర్‌రెడ్డి, కార్యవర్గ సభ్యుడు యాచం సురేశ్‌గుప్తా, మండల అధ్యక్షుడు సింగం శ్రీనివాస్, ప్ర ధాన కార్యదర్శి డప్పు రవి, బీజేవైఎం రాష్ట్ర ప్రో గ్రాం కోఆర్డినేటర్‌ తున్కి వేణు, నియోజకవర్గ ఇన్‌చార్జీలు నీలం చిన్నరాజు, తేలు శ్రీనివాస్, నాయ కులు నర్సింలు, ప్రవీణ్, రాజయ్య, హన్మండ్లు, రమేశ్‌రెడ్డి, ధర్మారెడ్డి, రాజిరెడ్డి, దేవెందర్, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు