సమకాలీనతకు అద్దంపట్టే చిత్రాలు

7 Sep, 2019 02:57 IST|Sakshi
శుక్రవారం మీడియాతో మాట్లాడుతున్న వైటీడీఏ ప్రత్యేకాధికారి కిషన్‌రావు. చిత్రంలో çస్థపతి సలహాదారు వేలు, ఆనంద్‌సాయి

భావితరాలకు చేర్చే ఉద్దేశంతోనే చెక్కారు

‘యాదాద్రి’లో కేసీఆర్, కారు చిత్రాలు శిల్పుల సొంత నిర్ణయం

వైటీడీఏ ప్రత్యేకాధికారి కిషన్‌రావు వివరణ

కారు బొమ్మను పార్టీ గుర్తుగా భావించొద్దని సూచన

సైకిల్, రిక్షా, ఎడ్లబండి బొమ్మలూ ఉన్నాయని వెల్లడి

అభ్యంతరాలుంటే మార్చడానికి సిద్ధమని స్పష్టీకరణ

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచ ఖ్యాతిని ఆర్జించే తరహాలో అత్యద్భుతంగా నిర్మిస్తున్న యాదాద్రి దేవాలయం బాహ్య ప్రాకారంలోని అష్టభుజి మండపంలో సమకాలీన పరిస్థితులను ప్రతిబింబించే ఆకృతులను శిల్పులు చెక్కారని వైటీడీఏ ప్రత్యేకాధికారి కిషన్‌రావు పేర్కొన్నారు.  సమాజంపై ప్రభావం చూపిన అంశాలకు సంబంధించిన చిత్రాలను భావి తరాలకు అందించే ఉద్దేశంతో దేవాలయాల్లో శిల్పాలు, చిత్రాలు చెక్కడం అనాదిగా వస్తోందన్నారు. యాదాద్రిలో శిల్పాలకు సంబంధించి శిల్పులు సొంతంగా తీసుకున్న నిర్ణయమే తప్ప, ప్రభుత్వ పాత్ర లేదని ఆయన స్పష్టంచేశారు. యాదాద్రి దేవాలయం బాహ్య ప్రాకారంలో ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్‌ఎస్‌ పార్టీ చిహ్నం కారు సహా పలు చిత్రాలు ఉన్న తీరుపై ఓ పత్రికలో కథనం వచ్చిన నేపథ్యంలో ఆర్కిటెక్ట్‌ ఆనంద్‌సాయి, స్థపతి సలహాదారు వేలుతో కలిసి ఆయన శుక్రవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు.

పెద్దపెద్ద ఆలయాలను కట్టించిన రాజులు, ప్రధాన శిల్పుల చిత్రాలతోపాటు నాటి సామాజిక పరిస్థితులకు అద్దం పట్టే చిత్రాలు తిరుపతి, అహోబిళం, శ్రీశైలం సహా పలు పురాతన దేవాలయాల్లో కనిపిస్తాయని.. ఆ కోవలోనే ఈ చిత్రాలు వచ్చాయని పేర్కొన్నారు. ఇందులో కేసీఆర్‌ను పోలిన ఔట్‌లైన్‌తో కూడిన చిత్రమే ఉందని, అది ఆయన పూర్తి ముఖ రూపు కాదని తెలిపారు. కారు బొమ్మ కూడా ఓ పార్టీ చిహ్నంగా భావించొద్దని, ఈ కాలంలో ఉన్న వాహనాలకు గుర్తుగా దాన్ని చెక్కారని వివరణ ఇచ్చారు. కారుతోపాటు సైకిల్, సైకిల్‌ రిక్షా, గుర్రపు బండి చిత్రాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. కమలం పువ్వు చిత్రం కూడా ఉందని, అంత మాత్రాన దాన్ని ఓ పార్టీ చిహ్నం గా భావిస్తామా అని ప్రశ్నించారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మంచిర్యాలలో విస్తరిస్తున్న గంజాయి

అప్పట్లో రాజులు కూడా ఇలా చేయలేదు

ఈనాటి ముఖ్యాంశాలు

బీజేపీ, టీఆర్‌ఎస్‌ కార్యకర్తల పోటాపోటీ

యాదాద్రిపై కారు బొమ్మా?

యాదాద్రిపై నీ బొమ్మలెందుకు?

నల్లమల అగ్నిగుండంగా మారుతుంది: చాడ

డీజేలు,డ్యాన్స్‌లు మన సంస్కృతి కాదు..

ప్రజలు, ప్రభుత్వం కలిసి పనిచేస్తేనే ఫలితం

పబ్లిసిటీ కోసం గాలి మాటలొద్దు..

మెదక్‌ చర్చి నిర్మాణం అద్భుతం..

ఎలక్ట్రిక్‌ బైక్‌పై రయ్‌రయ్‌!

లేడీ కిలాడి.!

జిల్లాలో మృత్యు పిడుగులు

పోలీస్‌ కేసుకు భయపడి ఆత్మహత్యాయత్నం

పని ప్రదేశాల్లో అతివలకు అండగా..

ఉల్లి ఘాటు.. పప్పు పోటు!

కాలువ కనుమరుగు!

‘వాల్మీకి’ టైటిల్‌ మార్చాలని ధర్నా

'వియ్‌' హబ్‌తో మహిళలకు ప్రోత్సాహం

బ్యాంకుల విలీనంతో ఆర్థిక సంక్షోభం

పాండు ఆశయం.. ఫలించిన వేళ 

ఉత్తమ గ్రామాలను దత్తత తీసుకుంటా: ఎర్రబెల్లి

కాస్త ఇసుక ఉంటే ఇస్తారా..! : కలెక్టర్‌

అట్టుడికిన కుడికిళ్ల.. రైతుల్ని తరిమి కొట్టిన పోలీసులు

ఉల్లంఘిస్తే ‘రెట్టింపు’

గ్రేటర్‌ క్యాబ్‌ సిటీ!

ఆఖరి మజిలీకీ అవస్థలే !

30 రోజుల ప్రణాళికను విజయవంతం చేయాలి

కంప్యూటర్‌ గణేశుడు..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నా జీవితంలో ఈగను మర్చిపోలేను

మాటలొద్దు.. సైగలే

చిన్న విరామం

బిగ్‌బాస్‌.. పునర్నవికి ప్రపోజ్‌ చేసిన రాహుల్‌

అలా చేస్తే సినిమా బాగాలేదని ఒప్పుకున్నట్లే!

దూసుకెళ్తోన్న గ్యాంగ్‌లీడర్‌ సాంగ్‌