ఆనంద్, పూర్ణలకు కేసీఆర్ భారీ నజరానా

14 Jun, 2014 14:47 IST|Sakshi
ఆనంద్, పూర్ణలకు కేసీఆర్ భారీ నజరానా

హైదరాబాద్: చిన్న వయసులోనే ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి రికార్డు సృష్టించిన తెలుగుతేజాలు ఆనంద్, పూర్ణలకు తెలంగాణ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు.. ఆనంద్, పూర్ణలకు చెరో 25 లక్షల రూపాయిల నగదు బహుమతిని ప్రకటించారు.

తెలుగు తేజం మాలావత్ పూర్ణ చిన్న వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన బాలికగా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక దక్షిణాది రాష్ట్రాల నుంచి ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా సాధనపల్లి ఆనంద్‌కుమార్‌ రికార్డులకెక్కాడు. 14 ఏళ్ల పూర్ణ నిజామాబాద్ జిల్లా తాడ్వాయి గురుకుల పాఠశాలలో 9వ తరగతి..  17 ఏళ్ల ఆనంద్ ఖమ్మం జిల్లా గురుకులంలో ఇంటర్ ఫస్ట్‌ఇయర్ చదువుతున్నాడు.

 పూర్ణ, ఆనంద్లు దేశ వ్యాప్తంగా ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. ఇటీవల లోక్సభ  వీరిద్దరినీ అభినందించింది. ప్రధాని నరేంద్ర మోడీ, పలువురు కేంద్ర మంత్రులు, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా పూర్ణ, ఆనంద్లను అభినందించి ఘనంగా సన్మానించారు. ఢిల్లీలో పూర్ణ, ఆనంద్ వారిని కలిశారు.

మరిన్ని వార్తలు