ఐటీలో మనమే మేటి

22 May, 2020 03:22 IST|Sakshi
గురువారం ప్రగతి భవన్‌లో ఐటీ  శాఖ వృద్ధి వివరాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చూపిస్తున్న మంత్రి కేటీఆర్‌

ఐటీ ఎగుమతుల్లో 17.93 శాతం వృద్ధి రేటు నమోదు

జాతీయ సగటుతో పోలిస్తే రెండింతలకుపైగా వృద్ధి

ఉద్యోగాల కల్పనలోనూ జాతీయ సగటు కంటే ఎక్కువ

జూన్‌ ఒకటిన పూర్తి స్థాయి నివేదిక వెల్లడిస్తాం: కేటీఆర్‌

ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ విభాగానికి సీఎం కేసీఆర్‌ ప్రశంసలు

సాక్షి, హైదరాబాద్‌: ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఎగుమతుల్లో 2019–20 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ 17.93% వృద్ధిరేటుతో గణనీయమైన పురోగతి సాధించింది. రాష్ట్ర ఆవిర్భావం నాటికి (2013–14) రాష్ట్రం నుంచి ఐటీ ఎగుమతులు రూ.57,258 కోట్లు కాగా, 2019–20లో రూ.1,28,807 కోట్లకు చేరాయి. జాతీయ స్థాయిలో ఎగుమతుల వృద్ధిరేటు 8.09 శాతమే కావడం గమనార్హం. 2019–20 ఆర్థిక సంవత్సరంలో ఐటీ ఎగుమతులు, ఉద్యోగాల కల్పనలో రాష్ట్ర ఐటీ విభాగం సాధించిన ప్రగతి వివరాలను ఐటీ మంత్రి కేటీఆర్, ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌.. సీఎం కేసీఆర్‌కు గురువారం ప్రగతిభవన్‌లో అంద జేశారు. కరోనా నేపథ్యంలో 2019–20 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ఐటీ ఎగు మతులపై ప్రభావం పడినా తెలంగాణ ఐటీ మాత్రం రికార్డు స్థాయిలో వృద్ధిరేటు సాధించింది.

ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ వృద్ధి రేటును మినహాయిస్తే జాతీయ ఐటీ వృద్ధి రేటు 6.92% మాత్రమే. కాగా ఎగు మతుల వృద్ధిరేటుతో పోలిస్తే జాతీయ సగటు రేటు కంటే రాష్ట్రం రెండింతలకుపైగా వృద్ధి సాధిం చింది. ఐటీ ఉద్యోగాల కల్పనలో జాతీయ వృద్ధిరేటు 4.93% కాగా తెలంగాణలో 7.2%గా నమోదైంది. తెలంగాణ వృద్ధిరేటు మినహాయిస్తే ఉద్యోగాల్లో జాతీయ వృద్ధిరేటు 4.59%. 2019–20లో ఐటీ ఉద్యోగాల్లో నమో దైన వృద్ధి రేటులో తెలంగాణ వాటా 50% కంటే ఎక్కువ ఉంది. 2019–20లో భారత ఐటీ ఎగుమతుల్లో మొత్తం తెలంగాణ వాటా 23.53శాతం కాగా, ఉద్యోగాల కల్పనలో రాష్ట్రం వాటా 19.07శాతంగా ఉంది.

హైదరాబాద్‌కు భారీ పెట్టుబడులు
2019–20 ఆర్థిక సంవత్సరంలో హైదరా బాద్‌ ఐటీ రంగంలో పేరెన్నికగన్న సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. 30 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అమెజాన్‌ తన కార్యా లయాన్ని, ప్రపంచంలోనే అతిపెద్ద పరిశో ధన, అభివృద్ధి కేంద్రాన్ని మైక్రాన్‌ ఏర్పాటు చేశాయి. రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరం వరంగల్‌లో (టైర్‌ 2) టెక్‌ మహీంద్ర, సియాంట్‌ కంపెనీలు తమ సెంటర్లను తెర వగా, పలు బహుళజాతి కంపెనీలను హైద రాబాద్‌కు తూర్పువైపు తమ కార్యాల యాలు ఏర్పాటు చేసేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. 2019–20 తొలి అర్ధ భాగంలో కమర్షియల్‌ స్పేస్‌ వినియోగంలో దేశంలోని ఇతర మెట్రో నగరాలకంటే హైదరాబాద్‌ అగ్రస్థానంలో నిలిచింది.

ఐటీ పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణ: సీఎం కేసీఆర్‌
రాష్ట్రం నుంచి ఐటీ ఎగుమతుల్లో గణనీయ మైన వృద్ధిరేటును సాధించిన ఐటీ విభాగాన్ని సీఎం కేసీఆర్‌ అభినందించారు. దేశంలోని ఐటీ ఎగుమతుల్లో రాష్ట్ర వృద్ధిరేటు 10.6 నుంచి 11.6 శాతానికి చేరడంపై సీఎం హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఐటీ రంగంలో పెట్టుబడులకు హైదరాబాద్‌ గమ్యస్థానంగా మారుతుందనే విషయాన్ని ఇది చెబుతోందని వ్యాఖ్యానించారు. కరోనా సమస్యను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలోని ఐటీ రంగం సజావుగా కార్యకలాపాలు నిర్వహించేలా చర్యలు తీసు కోవాలని సీఎం కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు. 2019–20 ఆర్థిక సంవత్సరంలో సాధించిన ప్రగతి నివేదికను జూన్‌ 1న ఐటీ విభాగం విడుదల చేస్తుందని కేటీఆర్‌ తెలి పారు. కరోనాను ఎదుర్కొనేందుకు హైదరా బాద్‌ ఐటీ పరిశ్రమ చేపట్టిన ‘ఐటీ4టీఎస్‌’ నినాదంతో రూ.70 కోట్ల మేర విరాళాలు సమకూరినట్లు ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ వెల్లడించారు.

ఐదేళ్లలో తెలంగాణలో ఐటీ ఎగుమతులు (రూ.కోట్లలో)
ఆర్థిక సంవత్సరం    ఎగుమతులు
2013–14            57,258
2014–15            66,276
2015–16            75,070
2016–17            85,470
2017–18            93,442 

ఎగుమతులు, ఉద్యోగాలు.. అన్నింటా ఐటీ వృద్ధి (ఎగుమతులు రూ.కోట్లలో)

మరిన్ని వార్తలు